ఎల‌క్ట్రిక్ కార్ కి ఉపాస‌న బ్రాండింగ్ చేస్తున్నారా?

Update: 2022-07-31 11:16 GMT
ఉపాసన కామినేని కొణిదెల ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అపోలో లైఫ్ చైర్ పర్సన్ గా- బి పాజిటివ్ మ్యాగజైన్ ఎడిటర్ గా ఆమె ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఉపాస‌న ప్ర‌స్తుతం త‌న లైఫ్ యాంబిష‌న్స్ పైనే ఎక్కువ ఫోక‌స్ చేసారు.

ఇక త‌న లైఫ్ కి సంబంధించిన ఏ విష‌యాన్ని అయినా ఉపాస‌న నేరుగా సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌కు చేర‌వేస్తుంటారు. ఇప్పుడు తాను ఒక స్పెష‌ల్ ఎల‌క్ట్రిక్ కార్ ని కొనుగోలు చేసారు. త‌న‌వ‌ద్ద ఇప్ప‌టికే హై ఎండ్ కార్ ల‌కు కొద‌వేమీ లేదు. అయితే ఆడి ఇ-ట్రాన్ కారును త‌న గ్యారేజీకి జోడించింది. ఇదే విష‌జ్ఞాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె కారు ధర దాదాపు రూ. 1.66 కోట్ల రూపాయలు.

``ఈ ప్రపంచంలోని ప్రతిదీ నిరంతరం అప్ గ్రేడ్ అవుతోంది. నేను ఎలక్ట్రిక్ ఆడి ఇ-ట్రాన్ తో నన్ను నేను అప్‌గ్రేడ్ చేసుకున్నాను. నా అన్ని అవసరాలకు ఇది నా ఉత్తమ ప్రయాణ సహచరుడు!`` అని ఉపాసన తన కారు వీడియోతో పాటుగా రాసింది. ఆడి ఇ-ట్రాన్ ఖ‌రీదు 1.01 - 1.17 కోట్ల ధర పరిధిలో లభించే SUV. ఇది 2 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఆన్ రోడ్ కి వ‌చ్చేస‌రికి కోటిన్న‌ర పైగా ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. రంగు.. అద‌న‌పు ఫీచ‌ర్స్ ని బ‌ట్టి కూడా కార్ ధ‌ర మారుతుంటుంది. ఉపాస‌న రెడ్ క‌ల‌ర్ ఈ ట్రాన్ ని కొనుగోలు చేసింది.
Tags:    

Similar News