ఫోటో స్టోరి: భార్యామ‌ణుల‌ డ‌బుల్ ధ‌మాకా ఫెస్టివ‌ల్

Update: 2022-03-27 03:31 GMT
రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ కుటుంబాలకు ఇది డబుల్ సెలబ్రేషన్స్ సమయం. RRR విజయం ఓ వైపు.. రామ్ చరణ్ పుట్టినరోజు ఇంకోవైపు.. మ‌రోవైపు జూ.ఎన్టీఆర్ భార్య ప్రణతి పుట్టినరోజు.. ఇన్ని వేడుక‌లు ఒకేసారి క‌లిసొచ్చాయి. ఈ రోజు నందమూరి తార‌క‌రామారావు భార్య పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రామ్ చరణ్ భార్య ఉపాసన త‌మ సెల‌బ్రేష‌న్స్ నుంచి కొన్ని ఫోటోల‌ను ఇన్ స్టాగ్రామ్ లో రిలీజ్ చేశారు. ఉపాస‌న‌కు డ‌బుల్ ధ‌మాకా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆర్.ఆర్.ఆర్ ఘ‌న‌విజ‌యం నేప‌థ్యంలో ఈ పుట్టిన‌రోజు వేడుక‌లు ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్నాయ‌ని చెప్పాలి. రెట్టించిన ఉత్సాహం ఉపాస‌న‌- ప్ర‌ణ‌తి క‌ళ్ల‌లో క‌నిపిస్తోంది.

ఉపాసన ప్రణతికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ప్ర‌త్యేకించి త‌న స్నేహితురాలితో కలిసి ఉన్న ఫోటోను పంచుకుంది. ``ప్రియమైన ప్ర‌ణ‌తి నంద‌మూరి.. బిగ్ ggggggg పుట్టినరోజుకు శుభాకాంక్షలు`` అని ఉపాస‌న‌ రాసింది. RRR ఘ‌న‌విజ‌యంతో పాటు పుట్టినరోజు కూడా అలా బ్లాక్ బస్టర్ అయ్యింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ ని తన భార్య పుట్టినరోజుకు ఏమి బహుమతిగా ఇస్తున్నారని అడిగినప్పుడు అతను RRR విజయం అని చెప్పాడు. వాస్తవానికి అతను వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు డ‌బుల్ ధ‌మాకా సెల‌బ్రేష‌న్స్ లో మునిగిపోయారు.

ఉపాసన కూడా మొదటి రోజు RRRని చూసారు. స్క్రీన్ పై తన భర్త మిస్టర్ సిని చూస్తున్న ఉపాస‌న‌ స్పందన హృదయాన్ని ద్రవింపజేస్తుంది. ఆమె ప్రతి క్షణాన్ని నిజమైన అభిమానిలా ఆస్వాధించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

స్టార్ హీరోల భార్యామ‌ణులు డబుల్ సెలబ్రేషన్స్ తో క్లౌడ్ నైన్ లో ఉన్నారు. ప్రమోషన్స్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చాలా ఇంటర్వ్యూలలో పేర్కొన్నట్లుగా.. అతను అర్ధరాత్రి రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటాడు. ఆన్-స్క్రీన్ - ఆఫ్-స్క్రీన్ రెండింటిలో వీరిద్దరి స్నేహం ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. భారతీయ సినిమాకే గర్వకారణమని ప్రేక్షకులు.. సినీ ప్రముఖులు అభివర్ణిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. గిరిజ‌న‌ విప్లవ స్వాతంత్య్ర సమరయోధులు కొమ‌ర‌మ్‌ భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ నటించారు అనే కంటే జీవించారు అంటే అతిశ‌యోక్తి కాదు. రాజ‌మౌళి మ‌రోసారి త‌న‌దైన మార్క్ ని చూపించారు.
Tags:    

Similar News