ఉపాసనా కామినేని కొణిదెల.. మెగా పవర్ స్టార్ భార్య ఉపాసన తన పేరును ఇలాగే రాసుకుంటుంది కాబట్టి.. మనం కూడా అదే కంటిన్యూ చేసేయచ్చు. సహజంగా ఈమె సోషల్ మీడియాతో టచ్ లోనే ఉంటుంది. తన సోషల్ నెట్వర్కింగ్ పేజ్ లో పోస్ట్ లు బాగానే చేస్తుంటుంది. అయితే.. ఇవన్నీ హెల్త్ అండ్ ఫిట్నెస్ కు సంబంధించినవే అయి ఉంటాయి.
ఈ మధ్య తన భర్త మిస్టర్ సి అయిన రామ్ చరణ్ కు బదులుగా కూడా తనే అప్ డేట్స్ ఇచ్చేస్తూ.. మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. అయితే.. ఈమె గత నాలుగు వారాలుగా మాత్రం రోజూ కచ్చితంగా ఓ పోస్ట్ చేస్తోంది. 'ట్రాన్స్ ఫాం యువర్ సెల్ఫ్' అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ తో.. నెల రోజుల్లో వర్కవుట్స్ ద్వారా తమను తాము ఎలా మార్చుకోవాలో నేర్పించేస్తోంది ఉపాసన. అయితే.. కేవలం చెప్పడమే కాదు.. వాటిని వీడియోల ఫార్మాట్ లో ఫిజియో ట్రైనర్ ద్వారా చెప్పించి.. చేయించి మరీ చూపిస్తుంది. మొత్తం నెల రోజుల్లో మన రూపాన్ని మార్చుకునేందుకు ఉద్దేశించినవే ఈ వీడియోలు. కొన్ని వీడియోల్లో తనే ఆయా వర్కవుట్స్ చేసింది కూడా.
ఇప్పటికి ఉపాసన ఇలా వర్కవుట్స్ చేస్తూ 26 వీడియోలను షేర్ చేసేసి 27వ రోజుకు వచ్చేసింది. మరి వీటిని ఎంతమంది ఫాలో అయ్యారో.. ఇంకెంత మంది వీటిని జాగ్రత్తగా భద్రపరచుకున్నారో చూడాలి. అపోలో లైఫ్ ద్వారా అందిస్తున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావడంతో.. వీటికి రెస్పాన్స్ చాలా బాగుందనే టాక్ ఉంది. మరి మీలో కూడా ఎవరైనా ఉపాసన చెప్పిన వర్కవుట్స్ ను వర్కవుట్ చేశారా?