మహాత్మ గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ భారత్ సహా పలు ప్రజోపయోగ కార్యక్రమాలపై అవగాహన పెంచేందుకు మోదీ ఎంచుకున్న మార్గానికి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందాయి. జైహింద్ మోదీజీ అంటూ సెల్యూట్ కొట్టారు. అయితే సినీకళాకారులతో సమావేశం విషయంలోనే ఉత్తరాది- దక్షిణాది అన్న వ్యత్యాసం సాక్షాత్తూ దేశ ప్రధాని అయిన నరేంద్ర మోదీనే చూపించడం ఎవరికీ నచ్చలేదు. ముఖ్యంగా సినీ కళాకారులతో సమావేశానికి దిల్ రాజు .. రకుల్ ప్రీత్ లాంటి ఒకరిద్దరు సౌత్ స్టార్లు మాత్రమే ఆహ్వానితులా? ఓటు హక్కును వినియోగించుకోండి అంటూ చేసిన ప్రచారానికి ఒక రూలు.. ఇప్పుడు ఇంకో రూలు అంటూ నిట్టూర్పు కనిపించింది. అప్పట్లో నాగార్జున-రజనీ సహా పలువురు టాలీవుడ్ స్టార్లను ఓటు హక్కు విషయంలో ప్రచారం చేయమని కోరిన నరేంద్ర మోదీ తాజాగా చేపట్టిన ఇంత మంచి కార్యక్రమానికి వీళ్లెవరినీ పిలవలేదే! అంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు.
ఈ విషయంలో మెగా కోడలు ఉపాసన ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించిన తీరుకు అభిమానుల నుంచి గొప్ప రెస్పాన్స్ వచ్చింది. దక్షిణాదిపై మోదీ చిన్నచూపును నిలదీసిన ధీరగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు ఉపాసన. ఈ రెండ్రోజుల్లోనే సామాజిక మాధ్యమాల్లో దీనిపై పెద్ద డిబేట్ నడిచింది. ఒకే ఒక్క దక్షిణాది సెలబ్రిటీ అది కూడా దిల్ రాజుకు మాత్రమే ఆహ్వానం అందిందేమిటో? అంటూ మాట్లాడుకున్నారు. దక్షిణాదిన లెజెండ్స్ అనదగ్గ రజనీకాంత్ - చిరంజీవి - కమల్ హాసన్ సహా ఎందరో దిగ్గజాలున్నారు. వీళ్లను ఎందుకు ఆహ్వానించలేదు! అంటూ ఊపాసన కామెంట్ కి ప్రతిగా అభిమానులు స్పందించారు. ప్రైడ్ ఆఫ్ సౌతిండియన్ సినిమా ఎస్.ఎస్.రాజమౌళి వంటి దిగ్గజాన్ని ఆహ్వానించాల్సింది అంటూ పలువురు సోషల్ మీడియా డిబేట్ లో అభిప్రాయ పడ్డారు. అంతేకాదు.. రాజమౌళి.. ఎన్టీఆర్ వీళ్లేనా సౌత్ స్టార్ల లో సెలబ్రిటీల్లో ఎంతో గొప్ప గొప్ప వాళ్లు ఉన్నారు.. అందరినీ ఆహ్వానించాల్సింది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే ఉపాసన పిలుపునకు స్పందించి ఖుష్బూ వంటి సీనియర్ నటి అండగా నిలిచారు కానీ.. మన టాలీవుడ్ నుంచి వేరొక సెలబ్రిటీ స్పందించిందే లేదు. కేవలం ఉపాసన- ఖుష్బూ వంటి కొందరు మాత్రమే ఇలాంటి ముఖ్యమైన విషయంపై స్పందిస్తారా? ఇతర స్టార్లు ఎందుకు స్పందించరు? వీళ్లకు ఈ విషయంలో అవేర్ నెస్ అన్నదే లేదా? సామాజిక జిజ్ఞాస అన్నది ఏ కోశానా కనిపించదా? ప్రతి సారీ అయిన దానికి కానిదానికి ట్వీట్లు.. రీట్వీట్లు చేసే మన స్టార్లు.. సోషల్ మీడియాల్లో ఎంతో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలు ఎవరూ దీనిపై ఎందుకు స్పందించడం లేదో? అంటూ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
తెలుగు సినిమా పాన్ ఇండియా సినిమాగా ఎదిగింది. మన స్టార్లు బాలీవుడ్ స్టార్లకు తక్కువేమీ కాదని ప్రూవ్ చేస్తున్నారు. 2019లో మనదే పై చేయిగా కనిపిస్తోంది. అయినా ఇంకా మనకు గుర్తింపు రావడం లేదు. పాలకుల్లో ఏలికల్లో ఇంకా పక్షపాతం కనిపిస్తోందన్నది సుస్పష్టం. కనీసం ఈమాత్రం అవగాహన అయినా లేదా మన స్టార్లకు? డబ్ స్మాష్ లు.. టిక్ టాక్ వీడియోలకు ఇచ్చే ప్రాధాన్యతలో ఒక శాతం అయినా ఇలాంటి వాటికి స్పేస్ ఇవ్వరా!!