చరణ్, ఉపాసన జోడిని దర్శక దిగ్గజం ‘క్లిక్’ మనిపిస్తే..!

Update: 2022-10-21 10:30 GMT
దర్శక దిగ్గజం రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ ఇండియాలో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన సంగతి అందరికీ తెల్సిందే. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ మూవీ తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లోనూ భారీగా వసూళ్లను రాబట్టడంతో నిర్మాతలకు కాసులవర్షం కురిపించింది.

తాజాగా ఈ సినిమాను జపాన్ భాషలో విడుదల చేయనున్నారు. ఈక్రమంలోనే మూవీ మేకర్స్ జపాన్ రాజధాని టోక్యోలో పర్యటిస్తున్నారు. ఓవైపు సినిమా ప్రమోషన్స్ చేస్తూనే మరోవైపు హాలీడే ట్రిప్పును ఎంజాయ్ చేస్తున్నారు. చరణ్, ఉపాసన జోడితోపాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఎస్ఎస్. రాజమౌళి కుటుంబాలు ఔటింగ్, డిన్నర్ లతో సరదా సరదాగా గడుపుతున్నారు.

అయితే అందరి దృష్టి మాత్రం చరణ్, ఉపాసన జోడిపైనే నెలకొంది. వీరిద్దరు జపాన్ లో ఎంట్రీ అయినప్పటి నుంచి మీడియా ఫోకస్ మొత్తం వీరిపైనే ఉంది. ప్రతీ విషయాన్ని అక్కడి మీడియా హైలెట్ చేస్తుండటంతో ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి కావాల్సినంత ప్రమోషన్స్ జరిగి పోతుంది. పనిలో పనిగా వీరిద్దరు సరదాగా గడిపిన క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఫొటోగ్రఫీపై ఆసక్తి కనబర్చే చరణ్ టోక్యోలో చూడదగిన ప్రదేశాలను తన కెమెరాలో బంధిస్తున్నాడు.  అంతేకాకుండా తన భార్య ఉప్సీ ఫొటోలను క్లిక్ మనిపిస్తున్నాడు. అయితే తానేమీ తక్కువ కాదన్నట్టుగా ఉపానస సైతం చరణ్ ఫొటోలను తీస్తూ భర్తకు తగ్గ భార్య అనిపించుకుంటోంది. ఇక వీరద్దరు కలిసి ఉన్న ఫొటోలను మాత్రం దర్శక దిగ్గజం రాజమౌళి కెమెరాతో క్లిక్ మనిపించినట్లు తెలుస్తోంది.

ఇదే విషయాన్ని ఉపాసన తన ట్వీటర్లో పోస్టు చేసింది.  తామిద్దరం కలిసిన దిగిన ఫొటోను దర్శక దిగ్గజం రాజమౌళి స్వయంగా  క్లిక్ చేశారని, ఈ ఫొటో తమకు మెమోరబుల్ చిత్రంగా ఉంటుందని ఉపాసన పేర్కొంది. దీంతోపాటుగా ‘విత్ లవ్ ఫ్రమ్ టోక్యో,  Konnichiwa (జపనీస్ లో హలో అని అర్థం), లవ్ సింబల్,  #RRRInJapanను హ్యాష్ టాగ్ చేస్తూ పోస్టు చేసింది.

ఈ ఫొటోలను చూసిన వారంతా ఉపాసన తన చిత్రంలో రాజమౌళికి తగిన మర్యాద ఇచ్చిందని అంటున్నారు. డైరెక్టర్ రాజమౌళి తన చిత్రాల మాదిరిగానే రాంచరణ్, ఉపాసన ఫొటోలపై సైతం తన మార్క్ స్టాంప్ వేశారంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News