మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమలో మాధుర్యం తెలిసిన ఆదర్శదంపతులు. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులకు..భార్యభర్తలకు కొన్ని విలువైన సూచనలు..సలహాలు కూడా ఇచ్చారు.
దానికి సంబంధించి నేరుగా ఉపాసన ఓ వీడియో రిలీజ్ చేసారు. ``ప్రేమలో పడినంత ఈజీ కాదు ఆ ప్రేమని నిలబెట్టుకోవడం. ప్రేమ పార్క్ లో నడక కాదు. జీవితకాలం సంతోషంగా ఉండాలి.
వివాహం అనేది మంచి ఆరోగ్యం లాంటింది. దాన్ని సక్సెస్ చేయడానికి నిరంతరం కృష్టి చేస్తూనే ఉండాలి. ఇది కేవలం ఓవర్ నైట్ లో జరగదు. దానిపై ఎప్పుడూ పనిచేయాలి. లేక పోతే ఆ ప్రేమ ఎంతో కాలం నిలబడదు. ఈ రోజుల్లో జీవితాన్ని సంతోషంగా సాగించాలంటే కొన్ని కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి. అవే జీవితాన్ని సంతోషంగా ముందుకు తీసుకెళ్తాయి. డిన్నర్ చేయడం ..కలిసి సినిమాలు చూడటం.. కలిసి కాలక్షేపంగా కబుర్లు చెప్పుకోవాలి.
అప్పుడే జంట మధ్య బంధం మరింత బలపడుతుంది. ఇప్పటివరకూ ఇలాంటివి చేయకుండా ఉంటే ఇకనైనా జాగ్రత్తపడండి. ఖాళీ సమయాల్లో చేయాల్సిన పనులు ఇవన్ని. ప్రేమికులు ఒకర్నిఒకరు బాగా అర్ధం చేసుకోవాలి. చిన్న విషయాల కారణంగా మనస్పర్ధలకు తావు ఇవ్వకూడదు.
అందరూ పెళ్లి స్వర్గంలో నిర్ణయిస్తారని అంటారు. కానీ కాదు ఇద్దరు వ్యక్తులు భూమ్మీద ఎంతో కష్టపడితేనే పెళ్లికి పునాది పడుతుంది. ఎక్కువగా ఎదుటవారిపై ప్రేమ గౌరవం చూపిస్తే ఆ బంధం బలంగా ఉంటుందని`` ఉపాసన తెలిపారు. ``అలాగే వివాహ బంధం లో ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యంపై ఎప్పుడూ శ్రద్ద వహించాలి.
వీలైనంత వరకూ ప్రతీ రోజు సరైన సమయంలో నిద్రపోవాలి. సమయం దొరికితే ప్రియమైన వారితో మాత్రం గడపండి. ఇలాంటివి తరుచుగా అలవాటు చేసుకోవాలి`` అని అన్నారు. మొత్తానికి ఓవైపు ప్రేమ బంధం గురించి చెబుతూనే హెల్త్ ఈజ్ వెల్త్ అని ముగింపును ఇచ్చారు.
ఆ సంగతిని పక్కనబెడితే ఉపాసాన చాలా విలువైన సమాచారం అందించారు. ప్రస్తుతం వివాహ బంధాలు ఎలా విచ్చినం అయిపోతున్నాయో చూస్తూనే ఉన్నాం. మనస్పర్ధలు..కోపతాపాలు తో విడాకుల వరకూ దారి తీస్తున్నారు.
ఇక చరణ్-ఉపాసనల వివాహమై 10 సంవత్సరాలు పూర్తయింది. చరణ్ తో వివాహమైన దగ్గర నుంచి హబ్బీ ప్రతీ విషయంలోనూ ఉపాసన పాలు పంచుకుంటారు. మంచి-చెడులు విశ్లేషించుకుంటారు. అలాగే సమయం దొరికనప్పుడల్లా చరణ్ పై ఉపాసన ఎంతగా ప్రేమ కురిపిస్తారో.
ఖాళీ సమయం దొరికితే చరణ్ కి నచ్చిన వంటకాలు వండి వడ్డించడం సహా చేస్తుంటారు. వాటికి సంబంధించిన ఫోటోల్ని ..వీడియోల్సి సైతం మెగా అభిమానులకు షేర్ చేస్తుంటారు.