చెర్రీ అండ్ రకుల్.. ఉపాసన ఫీలవుతోంది

Update: 2016-11-13 04:06 GMT
రామ్ చరణ్ ఇప్పుడు ధృవలో చివరిపాట షూటింగ్ కోసం రకుల్ ప్రీత్ తో కలిసి థాయ్ ల్యాండ్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. ఇది షూటింగ్ కోసం వెళ్లిన టూర్ అయినా.. తన వైఫ్ ఉపాసనను కూడా వెంటబెట్టుకుని వెళ్లాడు. ఇప్పుడు సాంగ్ షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోగా.. చెర్రీ-రకుల్ ఇద్దరూ తెగ ఉత్సాహంగా వర్క్ చేసేస్తున్నారట.

తన భర్తతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఎంత కష్టమైనా సరే ఉత్సాహంగా పని చేస్తుండడం చూసి.. ఉపాసనకి గిల్టీగా ఉందిట. 'వీకెండ్ ఆనందంగానే ఉన్నా.. గిల్టీగా ఉంది. రామ్ చరణ్ వర్క్ చూస్తుంటే ఉత్సాహం వస్తోంది. హార్డ్ వర్కింగ్ హజ్బెండ్' అంటూ ట్వీట్ చేసింది ఉపాసన. 'నటుల పని అసలేమాత్రం సులభం కాదు. డెస్క్ వెనకాల పనిచేయడానికే ప్రిఫరెన్స్. రామ్ చరణ్.. రకుల్ ప్రీత్ లకు నా రెస్పెక్ట్' అని కూడా చెబుతోంది ఉపాసన.

ఈ ట్వీట్స్ తో పాటు.. థాయ్ బీచ్ లో తీసుకున్న సెల్ఫీ కూడా పోస్ట్ చేసింది ఉపాసన. ఆ సంగతి అలా ఉంటే.. భర్త యాక్ట్ చేసే షూటింగ్ స్పాట్ కి వెళ్లి.. హీరో హీరోయిన్లు పాటలు పాడుకుంటుంటే.. ఎంజాయ్ చేయగల విశాల హృదయం అందరికీ ఉండదు. ఆ విషయంలో ఉపాసనకు ఎన్ని సార్లు హ్యాట్సాఫ్ చెప్పినా తక్కువే.  


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News