సమాజంలో జరిగే అన్యాయాల్ని సెలబ్రెటీలు పట్టించుకోవడం తక్కువ. ఒకవేళ పట్టించుకున్నా.. ‘సో శాడ్’ అంటూ ఓ చిన్న ట్వీట్ పెట్టి వదిలేసేవాళ్లే ఎక్కువమంది. ఐతే రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని మాత్రం ఇటీవల ఓ అమ్మాయికి జరిగిన అన్యాయంపై పెద్ద పోరాటమే చేయడానికి సిద్ధమైంది. సంచలనం సృష్టించిన ఇంజినీరింగ్ స్టూడెంట్ దేవి మర్డర్ కేసుకు సంబందించి ఆమె న్యాయం కోసం ఫేస్ బుక్ వేదికగా పోరాటం ఆరంభించింది. భరత్ సింహా రెడ్డి అనే ఓ బిగ్ షాట్ ను ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్నారు. ఐతే భరత్ ను కేసు నుంచి తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఉపాసన ఈ కేసుపై బోల్డ్ గా ఓ ఫేస్ బుక్ పోస్టు పెట్టడం విశేషం.
‘‘ఈ దేశం మరో ఆడబిడ్డను కోల్పోయింది. ఐతే నిందితుడి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అతడి పెద్ద పెద్ద వాళ్లతో సంబంధాలు ఉండటమే దీనికి కారణం. ఈ కేసు విషయంలో అందరం ఏకతాటిపైకి వద్దాం. చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని చూపిద్దాం. ఈ పోస్టుని సాధ్యమైనంత ఎక్కువమందికి చేరేలా షేర్ చేయండి. నిందితుడి మీద అధికారులు చర్యలు తీసుకునేలా ఒత్తిడి తెండి’’ అంటూ పెద్ద పోస్టు పెట్టింది ఉపాసన. ఆమె ఇచ్చిన పిలుపుకు జనాలు బాగానే స్పందించారు. ఇలాంటి కేసుతో మనకేంటి సంబంధం అనుకోకుండా ఉపాసన ఇలా ముందుకు రావడం.. పోరాటానికి దిగడం గొప్ప విషయమే. ఆమె పోరాటం ఫలించి దేవి హత్య కేసులో నిందితుడికి శిక్ష పడుతుందని ఆశిద్దాం.