ప్రముఖ ఎడిటర్ ఎస్ ఎమ్ రాజశేఖర్ రెడ్డి 'మాచర్ల నియోజవర్గం' సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. అయితే దర్శకుడు గతంలో కొన్ని సామాజిక వర్గాలను కించ పరుస్తూ ట్వీట్స్ పెట్టినట్లు పలు స్క్రీన్ షూట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నెటిజన్లు అతన్ని ట్రోల్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఎస్ఎమ్ రాజశేఖర్ రెడ్డి తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కొందరు తన పేరు మీద నకిలీ ట్వీట్లు సృష్టించి కులాలు మరియు వర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని.. తక్షణమే నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
'టెంపర్' 'బిజినెస్ మ్యాన్' వంటి పలు బ్లాక్ బస్టర్స్ తో సహా 50కి పైగా సినిమాలకు పని చేసిన సీనియర్ ఎడిటర్ ని నేను. ఇప్పుడు నితిన్ హీరోగా 'మాచర్ల నియోజకవర్గం' అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాను. ఆగస్టు 12న ఈ సినిమా విడుదల కాబోతోంది అని దర్శకుడు పేర్కొన్నారు.
అయితే గత రాత్రి నుంచి కొన్ని దుష్ట ఎలిమెంట్స్ కు నన్ను ఆపాదిస్తూ.. కమ్మ, కాపు కులాలను మరియు ఇతర వర్గాలను దూషిస్తూ నా పేరుతో కొన్ని నకిలీ ట్వీట్స్ సృష్టించారు. వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు #BanMacherlaNiyojakavargam అనే హ్యాష్ ట్యాగ్ ను సృష్టించారు.
ఈ అంశాలను 'మాచర్ల ముచ్చట్లు' పేరుతో ట్విట్టర్ స్పేస్ లలో దుష్ప్రచారాన్ని ప్రారంభించారు. ఇవి సమాజంలో వివిధ కులాలు మరియు వర్గాల సామరస్య సహజీవనానికి భంగం కలిగించే అత్యంత ప్రమాదకరమైన చర్యలు. ఇలాంటి విషపూరిత చర్యల వల్ల మా సినిమాకి మరియు నా వ్యక్తిగత కెరీర్ కు కోలుకోలేని నష్టం జరగడమే కాకుండా.. సమాజంలో శాంతిభద్రతలు తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో దుర్మార్గులపై వీలైనంత త్వరగా కఠిన చర్యలు తీసుకోవాలని మరియు వారిని చట్టానికి తీసుకురావాలని కోరుతున్నానని ఎస్ ఎమ్ రాజశేఖర్ రెడ్డి తన ఫిర్యాదు ద్వారా పోలీసులకు తెలియజేసారు. అంతేకాదు ఫేక్ ట్వీట్స్ మరియు ట్విట్టర్ స్పేస్ స్క్రీన్ షాట్ కాపీలను అందజేశారు.
తన పేరుతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ట్వీట్ స్క్రీన్ షాట్స్ పై దర్శకుడు ఇప్పటికే వివరణ ఇచ్చారు. అవన్నీ ఫేక్ పోస్టులు అని.. ఎవరూ నమ్మవద్దని కోరాడు. ఎవరో కావాలని ఎడిట్ చేసి నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పాడు. స్క్రీన్ షాట్ లో వున్న పేరు.. నా పేరుతో వున్న స్పెల్లింగ్ వేరు. ఫోటో షాప్ చేసిన వాడెవడో సరిగా చేయలేదని ట్వీట్ లో పేర్కొన్నాడు.
నేను స్వతహాగా వైఎస్సార్ అభిమానిని. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నా అభిప్రాయాన్ని చెప్పానే తప్ప.. వేరే ఏ కులాన్ని కించపరచలేదు. ఆ సమయంలో నేను చేసిన ట్వీట్ ని ఒక్కటి కూడా డిలీట్ చేయలేదు. చేయను కూడా అని ఎస్ఆర్ శేఖర్ వివరణ ఇచ్చారు.
దీనిపై హీరో నితిన్ స్పందిస్తూ దర్శకుడికి మద్దతుగా నిలిచారు. ఒక ఫేక్ ట్వీట్ అనవసరమైన వివాదం సృష్టించింది. దురదృష్టవశాత్తు ఇది మిగతావారి మనోభావాలను దెబ్బతీసింది. ఇది చాలా విచారకరం. అంతేకాదు, ఈ పోస్ట్ అందరిని చాలా నిరాశపరిచింది. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నేను ఖండిస్తున్నాను అని నితిన్ పేర్కొన్నారు.