కొత్త సంవత్సరాన్ని కొత్తగా ఉరకలెత్తించేందుకు మెగా క్రేజీ సినిమాలొస్తున్నాయి. ఈ సినిమాల ప్రచారానికి ఫిలింమేకర్స్ కొత్త ఒరవడితో దూసుకొస్తున్నారు. ఇప్పటికిప్పుడు డజను భారీ క్రేజీ సినిమాల ట్రైలర్ల లాంచ్ కి టైమ్ దగ్గర పడింది. ట్రైలర్ తో మెప్పిస్తే సగం విజయం సాధించినట్టే. అందుకే వీటి విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుని విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
ఇందులో భాగంగా తొలిగా .. శర్వానంద్ నటించిన `పడి పడి లేచే మనసు` ట్రైలర్ ఈ సోమవారం సాయంత్రం (17 డిసెంబర్) రిలీజ్ కానుంది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరగనున్న ఈ ఈవెంట్ కి బన్ని ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నారు. వరుణ్ తేజ్ `అంతరిక్షం` ట్రైలర్ ఇప్పటికే రిలీజైంది. ఈనెల 18న జేఆర్ సీ సెంటర్ లో జరగనున్న ప్రీరిలీజ్ వేడుకలో స్పెషల్ ట్రైలర్ ట్రీట్ ఉంటుందట. ఈ వేడుకకు చెర్రీ ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న నటసార్వ భౌమ.. అన్నగారు సీనియర్ ఎన్టీఆర్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు క్రిష్ టీమ్ రెడీ అవుతోంది. ఎన్టీఆర్ బయోపిక్ లో తొలి భాగం `కథానాయకుడు` ట్రైలర్ ఈనెల 21న రిలీజవుతోంది. అన్నగారు ఎన్టీఆర్ జీవితకథలో టైటిల్ పాత్ర పోషిస్తూ బాలయ్య తీస్తున్న సినిమా కాబట్టి ఇప్పటికే నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ ట్రైలర్ ట్రీట్ ఎలా ఉండబోతోంది? అన్న ఆసక్తి నెలకొంది. అలాగే ఈ వేడుకకు కేసీఆర్ ని ఆహ్వానిస్తారన్న ఊహాగానాలున్నా.. ఆయనొస్తారా? లేదా అన్న సందిగ్ధత నెలకొంది. ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ ఈ ట్రైలర్ వేడుకకు ఎటెండ్ అయ్యే అవకాశం ఉందట.
రామ్ చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న `వినయ విధేయ రామా` ట్రైలర్ - ప్రీరిలీజ్ ట్రీట్ జనవరి 4న ఉండనుంది. ఈ ట్రీట్ కి ఇండస్ట్రీ బెస్ట్ దిగ్గజాలు అతిధులుగా విచ్చేస్తున్నారు. ఎన్టీఆర్ - రాజమౌళి - రానా తదితరులు ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా విచ్చేస్తారని చెబుతున్నారు. `వినయ విధేయ రామా` టీజర్ తోనే మాస్ లో మోతెక్కించాడు బోయపాటి. ట్రైలర్ తో ఎలాంటి ట్రీట్ ఇస్తాడోనన్న ఉత్సాహం మెగాభిమానుల్లో నెలకొంది. క్వీన్ కంగన ఝాన్సీరాణిగా నటించిన `మణికర్ణిక` జనవరి 25న తెలుగు - తమిళ్ - హిందీలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 18న అన్ని భాషల ట్రైలర్లు రిలీజవుతున్నాయని తరణ్ ఆదర్శ్ ప్రకటించారు. అలాగే క్వీన్ రీమేక్ (తెలుగు - తమిళ్ - కన్నడం) ట్రైలర్లు రానున్నాయి. క్వీన్ తెలుగు వెర్షన్ `దటీజ్ మహా లక్ష్మీ` టీజర్ ఈనెల 21న ట్రీట్ ఇవ్వనుంది. అలాగే సంక్రాంతికి ట్రైలర్ లాంచ్ అయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు సాగుతున్నాయి. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ పెట్టా టీజర్ ఇప్పటికే వచ్చింది.. కొత్త సంవత్సరం వేళ 31 రాత్రి మిడ్ నైట్ ట్రైలర్ ట్రీట్ ఉంటుందని ప్రకటించారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న `మహర్షి` కి సంబంధించి డిసెంబర్ 31 మిడ్ నైట్ స్పెషల్ ట్రీట్ ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. వెంకీ- వరుణ్ తేజ్‌ల `ఎఫ్ 2` సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజవుతోంది. ఈ సినిమాకి సంబంధించి కొత్త సంవత్సరం రోజు ట్రీట్ ప్లాన్స్ చేస్తున్నారట. వైయస్సార్ బయోపిక్ `యాత్ర`కు సంబంధించి న్యూ ఇయర్ లేదా జనవరి తొలివారంలో ట్రీట్ ఉంటుందట. అఖిల్ నటించిన `మిస్టర్ మజ్ను` - చై-సామ్ సినిమాలకు సంబంధించి న్యూ ఇయర్ ట్రీట్ కి ప్రిపరేషన్ సాగుతోందిట. అజిత్ `విశ్వాసం` జనవరి తొలివారంలో ట్రైలర్ ట్రీట్ ఇస్తారని చెబుతున్నారు. సంక్రాంతి బరిలో ఈ సినిమా వస్తుందా లేదా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సూర్య నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం `ఎన్ జీకే` కొత్త సంవత్సరం ట్రీట్ కి రెడీ అవుతోందట. మొత్తానికి వరుసగా ఈ 15రోజులు స్పెషల్ ట్రైలర్ ధమాకా ట్రీట్ ఖాయమైనట్టే.