మాయ‌ని మ‌చ్చ‌గా మిగిలిపోయింది

Update: 2022-05-03 01:30 GMT
ఎంతో ఇష్ట‌ప‌డి చేసింది బెడిసి కొడితే ఆ బాధ మాయ‌ని మ‌చ్చ‌గా మిలిపోతుంటుంది. ఇప్ప‌డు మెగా వారికి, ఫ్యాన్స్ కు 'ఆచార్య‌' అలాంటి సినిమాగానే మారిపోయింది. వివ‌రాల్లోకి వెళితే... స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో మెగాస్టార్ చిరంజీవి ఏరి కోరి చేసిన సినిమా 'ఆచార్య‌'. ఇందులో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌రణ్ కీల‌క పాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. చిరు నుంచి దాదాపు రెండేళ్ల విరామం త‌రువాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై స‌హ‌జంగానే అభిమానులు భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ వారిని 'ఆచార్య‌' ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.

భారీ స్థాయిలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలుస్తుంద‌నుకున్న 'ఆచార్య‌' ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌క‌పోగా డిస్టార్ గా నిలిచింది. కొర‌టాల శివ ట్రాక్ రికార్డ్ ప్ర‌కారం ఈ మూవీ ఈ స్థాయిలో డిజాస్ట‌ర్ కావ‌డానికి వీళ్లేదు. 'మిర్చి' నుంచి 'భ‌ర‌త్ అనే నేను' వ‌ర‌కు కొర‌టాల శివ చేసిన సినిమాల‌న్నీ వ‌రుస‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లుగా నిలిచి బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టాయి. కానీ 'ఆచార్య‌' మాత్రం నిరుత్సాహ ప‌రిచింది. ముందు చ‌ర‌ణ్ తో భారీ ప్రాచెక్ట్ చేయాల‌నుకున్నారు కొర‌టాల‌. అంతా ఓకే.. ముహూర్తం కూడా చేశారు. కార‌ణం ఏంటో తెలియ‌దు కానీ ఆ ప్రాజెక్ట్ అక్క‌డే ఆడిపోయింది.

ఈ విష‌యం గ‌మ‌నించిన మెగాస్టార్ చిరంజీవి చ‌ర‌ణ్ తో కుద‌ర‌క‌పోతే నాతో సినిమా చేయెచ్చు క‌దా అంటూ కొర‌టాల శివ‌కు ఆఫ‌ర్ ఇచ్చారు. దీంతో 'ఆచార్య‌' ప‌ట్టాలెక్కింది. క‌థ రాస్తున్న స‌మ‌యంలోనే కీల‌క పాత్ర ఒక‌టి పుట్టుకొచ్చింది. 15 నిమిషాల పాత్ర అది. ఇందు కోసం చ‌ర‌ణ్ అయితేనే క‌రెక్ట్ అని చిరు భావించి త‌న కోసం ఎదురుచూశారు. చ‌ర‌ణ్ 'ట్రిపుల్ ఆర్‌' షూటింగ్ తో బిజీగా వుండ‌టం వ‌ల్ల త‌న‌ని ఎలాగైనా 'ఆచార్య‌'లో న‌టింప‌జేయాలని చిరు జ‌క్క‌న్న‌ని క‌న్విన్స్ చేశారు. త‌న భార్య డ్రీమ్ అని చెప్ప‌డంతో రాజ‌మౌళి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసి చ‌ర‌ణ్ ని రిలీజ్ చేశాడు.

ఆ త‌రువాత చ‌ర‌ణ్ పాత్ర 15 నిమిషాల నుంచి 45 నిమిషాల‌కు మారింది. అంతా ఒకే చిరు ఫ్యామిలీకిది చాలా స్పెష‌ల్ మూవీ అని ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో ఈ ప్రాజెక్ట్ పై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. గ‌తంలో చిరు మ‌గ‌ధీర‌, బ్రూస్ లీ చిత్రాల్లో చ‌ర‌ణ్ తో క‌లిసి సంద‌డి చేశారు. ఆ త‌రువాత చ‌ర‌ణ్ 'ఖైదీ నంబ‌ర్ 150'లోని ఓ పాట‌లో త‌ళుక్కున మెరిసారు. కానీ పూర్తి స్థాయి పాత్ర‌ల్లో ఇద్ద‌రు క‌లిసి న‌టించ‌లేదు. అది ఇన్నాళ్లకు 'ఆచార్య‌' రూపంలో కుద‌ర‌డంతో మెగా అభిమానుల‌తో పాటు మెగా ఫ్యామిలీ కూడా ఈ చిత్రాన్ని చాలా ప్ర‌త్యేకంగా చూసింది.  

తొలి సారి క‌లిసి న‌టించిన ఈ మూవీ ఎప్ప‌టికీ గుర్తుండిపోయే సినిమాగా నిలుస్తుంద‌ని ఆనందించారు. కానీ ఫ‌లితం తారుమారైంది. సినిమా తొలి రోజే అభిమానుల్ని నిరాశ‌ప‌రిచింది. దీంతో మ‌ధుర జ్ఞాప‌కంలా మిగిలిపోతుంద‌ని భావించిన 'ఆచార్య‌' మెగా ఫ్యామిలీకి మాయ‌ని మ‌చ్చ‌గా మిగిలిపోయింది. అత్యంత ఇష్ట‌ప‌డి చేసిన ఈ మూవీ మెగా వారి కెరీర్ లోనే అత్యంత డిజాస్ట‌ర్ గా మారింది.

ఈ ఫ‌లితంగా సినిమా భారీ  స్థాయిలో న‌ష్టాల‌ని అందించే అవ‌కాశం వుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. చిరు సినిమాకు ఈ స్థాయిలో న‌ష్టాలని అందించిన సంద‌ర్భాలు అస‌లు లేవు. 'బిగ్ బాస్' లాంటి సినిమా కూడా ఈ రేంజ్ లో న‌ష్టాల‌ని అందించ‌క‌పోవ‌డంతో మెగా అభిమానులు ఫీల‌వుతున్నార‌ట‌. ఏరి కోరి చేసిన సినిమా ఈ స్థాయిలో షాకివ్వ‌డం వారు జీర్ణించుకోలేక‌పోతున్నారట‌. 60 నుంచి 70 కోట్ల మేర న‌ష్టాల‌ని అందించ‌బోతున్న ఈ సినిమా నిజంగా మెగా వారికి మాయ‌ని మ‌చ్చే అంటున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు.
Tags:    

Similar News