పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల 'భీమ్లా నాయక్' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. ఈ మూవీ తరువాత బ్లాక్ టు బ్యాక్ సినిమాలతో స్పీడు పెంచేస్తున్నారు. ఒక సినిమా సెట్స్ పై వుండగానే మరో రెండు.. మూడు చిత్రాలని పవన్ పట్టాలెక్కించాలనే ఆలోచనలో వున్నారు. ఇప్పటికే గత కొన్ని నెలలుగా రీమేక్ చిత్రా లకారణంగా ఆలస్యమవుతూ వస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్రాన్ని ఇటీవలే పునః ప్రారంభించారు. క్రిష్ జాగర్లమూడి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ ఏప్రిల్ 6న హైదరాబాద్ లో మొదలైంది.
పాపులర్ ఆర్ట్ డైరెక్టర్ పద్మశ్రీ తోట తరణి నేతృత్వంలో 'హరి హర వీరమల్లు' కోసం ప్రత్యేకంగా భారీ సెట్ లని నిర్మించారు. ఇందులో కీలక ఘట్టాల చిత్రీకరణ ప్రారంభమైంది. పవన్ ఇందు కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని మరీ పోరాట ఘట్టాల షూట్ లో పాల్గొంటున్నారు.
ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ తో ఈ మూవీ 20 టు 30 పర్సెంట్ మాత్రమే పూర్తయిందని తెలిసింది. అయితే ఈ మూవీ కోసం దాదాపు 5 నెలలు కేటాయించిన పవన్ ఈ సినిమా పూర్తయ్యే వరకు మరో చిత్రానికి వెళ్లే అవకాశం లేదని అంతా భావించారు.
కానీ అనూహ్యంగా పవన్ కల్యాణ్ ఈ మూవీ షూటింగ్ చేస్తూనే మరో రెండు రీమేక్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వీటిని త్వరలోనే పట్టాలెక్కించబోతున్నారు. ఇందు కోసం 'హరి హర వీరమల్లు' కు జూలై నుంచి బ్రేక్ ఇవ్వబోతున్నారట. అంటే జూలై ఎండ్ వరకు కంప్లీట్ చేసి ఆ తరువాత తమిళ సూపర్ హిట్ చిత్రాల రీమేక్ లలో నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో సముద్రఖని నటించి తెరకెక్కించిన చిత్రం 'వినోదాయ సితం'. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రాన్ని పవన్ తో తెలుగులో రీమేక్ చేయబోతున్నారు.
ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. అంతే కాకుండా తెలుగు నేటీ విటీకి అనుగుణంగా కథలో మార్పులు కూడా చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ కీలక పాత్రలో నటించనున్నీ మూవీని సముద్రఖని డైరెక్ట్ చేయబోతున్నాడు. జీ స్టూడియోస్, పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, త్రివిక్రమ్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఈ మూవీని త్వరలోనే ప్రారంభించబోతున్నారట. అంతే కాకుండా ఈ మూవీతో పాటు విజయ్ హీరోగా నటించిన 'థేరీ' (పోలీసోడు గా తెలుగులో విడుదలైంది) ని కూడా రీమేక్ చేయబోతున్నారు.
ఇందులోనూ పవన్ నటించడానికి రెడీ అవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని 'సాహో' ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. గత కొంత కాలంగా ఈ మూవీ పలువురు హీరోల వద్దకు వెళ్లి చివరికి పవన్ కల్యాణ్ కు చేరింది. ఈ చిత్రాన్ని కూడా త్వరలోనే పట్టాలెక్కించబోతున్నారట. హరి హర ఉ బ్రేక్ ఇచ్చి ఆ గ్యాప్ లో ఈ రెండు చిత్రాలని ఫటా ఫట్ కంప్లీట్ చేసి బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేయాలని పవన్ ప్లాన్ చేస్తున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.