కీర్తి సురేష్.. ఈ మలయాళ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. 'గీతాంజలి' అనే మలయాళ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన 'నేను శైలజ'తో ఇటు టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. తొలి చిత్రంతోనే తనదైన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకర్షించిన కీర్తి సురేష్.. 'మహానటి' మూవీతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయింది.
ఈ చిత్రంలో అలనాటి నటి సావిత్రిగా అద్భుతమైన నటనను కనబరిచి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఈ మూవీ అనంతరం కీర్తి సురేష్ కు ఇక తిరుగుండదని అందరూ భావించారు.
కానీ, అందరి ఊహలకు భిన్నంగా ఆమె కెరీర్ క్రమంగా డౌన్ అయిపోయింది. అందుకు కారణం ఆమె వరసగా చేసిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలే. కథ, స్క్రీన్ ప్లే వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి వంటి చిత్రాలు చేసింది.
అయితే ఈ చిత్రాలు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరచడమే కాదు.. కీర్తి సురేష్ మార్కెట్ ను సైతం దెబ్బ తీశాయి. ఇక కెరీర్ పూర్తిగా డౌన్ అవుతున్న తరుణంలో 'సర్కారు వారి పాట' మూవీలో మహేశ్ బాబుకు జోడీగా నటించే అవకాశం వచ్చింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ఇటీవలె విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇందులో కళావతిగా కీర్తి సురేష్ మిస్మరైజ్ చేసింది.
ఈ మూవీతో కెరీర్ పరంగా మళ్లీ పుంజుకున్న కీర్తి సురేష్.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా 'సర్కారు వారి పాట' సక్సెస్ పై ఆనందం వ్యక్తం చేసింది. 'సర్కారు వారి పాట' తర్వాత తనకు మరిన్ని కమర్షియల్ చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయని, అయితే కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తూ ముందుకెళ్లడమంటే తనకిష్టమని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.
అంతేకాదు, నాయిక ప్రాధాన్యం ఉన్న కథలు వస్తే తప్పకుండా నటిస్తానంటూ కుండబద్దలు కొట్టింది. దీంతో ఆమె ఫ్యాన్స్ తెగ వర్రీ అయిపోతున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కలిసిరాకపోయినా.. మళ్లీ వాటినే చేస్తానని చెప్పి ఎందుకు తప్పు చేస్తోందంటూ అభిమానులు కలవర పడుతున్నారు. కాగా, కీర్తి సురేశ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె నాని సరసన 'దసరా', మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా 'భోళా శంకర్' చిత్రాలు చేస్తోంది. అలాగే తమిళ్, మలయాళ భాషల్లోనూ పలు ప్రాజెక్ట్స్ కు కీర్తి సైన్ చేసింది.