గత ఏడాది చివర్లో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పుష్ప 2 ను వెంటనే మొదలు పెట్టాలి అనుకున్నప్పటికి స్క్రిప్ట్ విషయంలో కాస్త ఎక్కువగా వర్కౌట్స్ చేశారు. పాన్ ఇండియా రేంజ్ లో పుష్ప సక్సెస్ అయిన నేపథ్యంలో పుష్ప 2 అంతకు మించి ఉండాలి అనే ఉద్దేశ్యంతో పది నెలల పాటు స్క్రిప్ట్ వర్క్ చేశారు.
ఎట్టకేలకు ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యిందట. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను 350 కోట్ల నుండి 400 కోట్ల వరకు ఖర్చు చేసి నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో అల్లు అర్జున్ యొక్క పారితోషికం వంద కోట్లకు పైగా ఉంటుందట. ఇక దర్శకుడు సుకుమార్ కు 25 నుండి 30 కోట్ల వరకు ఉందట.
మైత్రి మూవీ మేకర్స్ వారు పెట్టిన బడ్జెట్ తిరిగి వచ్చిన తర్వాత లాభాల్లో 40 శాతం మాత్రమే తీసుకోనున్నారట. మిగిలిన 60 శాతంలో అల్లు అర్జున్ కు 30 శాతం మరియు సుకుమార్ కు 30 శాతం దక్కనున్నట్లుగా సమాచారం అందుతోంది.
అల్లు అర్జున్ పుష్ప 2 కోసం ఏడాది కాలంగా కష్టపడుతున్నారు. మరో ఏడాదికి పైగా మరే సినిమా చేయకుండా ఉండాలి. పుష్ప సినిమాలోనే మాస్ లుక్ తో మెప్పించిన బన్నీ పుష్ప 2 లో అంతకు మించి అన్నట్లుగా తన నటన మరియు లుక్ తో మెప్పించాల్సి ఉంది.
పుష్ప 2 కోసం బన్నీ పడుతున్న కష్టం కు వంద కోట్ల పారితోషికం సబబే అనేది చాలా మంది అభిప్రాయం. ఇక పుష్ప 2 సక్సెస్ అయ్యి అటు ఇటుగా వంద కోట్ల లాభం వస్తే బన్నీకి మరో 30 కోట్లు అదనంగా వస్తాయి. అంటే 130 కోట్ల రూపాయలు పుష్ప 2 సినిమా తో బన్నీకి దక్కబోతుంది.
థియేట్రికల్ రైట్స్ మరియు ఇతర రైట్స్ ద్వారా ఈజీగానే సినిమా బడ్జెట్ ను రికవరీ చేస్తుంది. కనుక సినిమా మినిమం ఆడినా కూడా వంద కోట్ల లాభాలు వస్తాయి. అదే జరిగితే బన్నీ ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నెం.1 హీరోగా నిలవడం ఖాయం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.