ప్రపంచవ్యాప్తంగా అవతార్ కు అభిమానులు పెరిగి పోతూనే ఉన్నారు. ఎన్నో సంవత్సరాల క్రితం వచ్చిన అవతార్ కు సీక్వెల్ గా అవతార్ 2 : ది వే ఆఫ్ వాటర్ ను గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన విషయం తెల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా ఇంకా కూడా అవతార్ మాయలోనే తేలిపోతూ ఉంది.
ఇప్పుడు అవతార్ 3 యొక్క మేకింగ్ గురించి మరియు కాన్సెప్ట్ గురించి అంతర్జాతీయ మీడియా నుండి గల్లీ మీడియా వరకు చర్చ జరుగుతోంది. ఎట్టకేలకు క్రియేటర్ ఆఫ్ అవతార్ స్పందించారు. అవతార్ 3 ని ది వే ఆఫ్ ఫైర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
అవతార్ 3 లో మరో రెండు సంస్క్రృతులకు చెందిన వారిని చూడబోతున్నట్లుగా కామెరూన్ పేర్కొన్నారు. ఫైర్ ఒక గుర్తుగా ఉంటుంది.. మన జీవన శైలిలో ఫైర్ అనేది అత్యంత కీలకం. అలాంటి ఫైర్ నేపథ్యంలో అవతార్ 3 ఉంటుందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కామెరూన్ క్లారిటీ ఇచ్చాడు.
మూడవ భాగంలో ఒమక్టయా.. మెట్కైనా తెగలను చూపించబోతున్నారట. పాండోరా ప్రపంచంలోనే భాగంగా ఈ రెండు తెగలు మరియు సంస్కృతులు కూడా ఉంటాయని దర్శకుడు తెలియజేశాడు.
అవతార్ 2 కాస్త అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యిందని కొందరు అంటున్నారు. కానీ మూడవ పార్ట్ మాత్రం ఊహకు అందని విధంగా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.