100 రోజులే..! అవ‌తార్ ఫ్యాన్స్ ఊపిరి బిగ‌బ‌ట్టాలి!!

Update: 2022-09-08 13:30 GMT
జ‌స్ట్ 100 రోజులే..! మోస్ట్ అవైటెడ్ అవ‌తార్ 2 రిలీజ్ కి డెడ్ లైన్ ఇది. అక్ష‌రాలా ఇంకా వంద‌ రోజులే స‌మ‌యం ఉంది. రికార్డులు తుత్తునియ‌లు చేయ‌డానికి అవ‌తార్ 2 రెడీ. ఇది చాలా కాలంగా ప్ర‌జ‌లు అభిమానులు వేచి చూస్తున్న సినిమా. 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు ఇక స‌మ‌య‌మాస‌న్న‌మైంది.

గత 12 ఏళ్లలో అత్యంత భారీ అంచనాలున్న సినిమా ఏది? అంటే అవ‌తార్ 2 అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. జేమ్స్ కామెరూన్ మ‌రో సృష్టిని క‌నులారా వీక్షించేందుకు అందునా ఐమ్యాక్స్ 3డీలో వీక్షించేందుకు భార‌త‌దేశం స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.

జేమ్స్ కామెరూన్ ''అవతార్: ది వే ఆఫ్ వాటర్'' లో ఎలాంటి అద్భుతాల్ని ఆవిష్క‌రిస్తారో చూడాల‌న్న త‌హ‌త‌హ అంత‌కంత‌కు పెరుగుతోంది. దూరదృష్టిగల దర్శకుడు మిలియన్ల కొద్దీ ప్ర‌జ‌ల గుండెల్ని చిద్రం చేస్తున్నాడు. 2009 లో అవతార్ విడుద‌లైంది.

ది టెర్మినేటర్ -ఏలియన్స్-ది అబిస్-టెర్మినేటర్ 2: జడ్జిమెంట్ డే వంటి చిత్రాల‌కు క‌థ‌లు రాసి  దర్శకత్వం వహించి నిర్మించి జనాదరణ పొందిన గొప్ప సంచ‌ల‌నాల దార్శ‌నికుడు జేమ్స్ కామెరూన్. సినిమా చరిత్రలో అత్యంత పాపుల‌ర్ ద‌ర్శ‌కుడిగా ఆయ‌న వెలిగిపోవ‌డంలో అవ‌తార్ కంటే ముందే ఎన్నో సాహ‌సాలు దాగి ఉన్నాయి. అవ‌తార్ 2 ప్ర‌పంచ సినిమా గేమ్ ఛేంజ‌ర్ గా సంచ‌ల‌నాలు సృష్టించింది.

ఈసారి అవ‌తార్ ల నీటి మార్గంని తెలుసుకోవాల‌ని ప్ర‌జ‌లు త‌పిస్తున్నారు. అందుకే వంద రోజుల్లో అవ‌తార్ 2 వ‌స్తోంది అన‌గానే ఒక‌టే గుబులు గుబులుగా ఉంది. ఇది ఇత‌ర సినిమాల‌ అన్ని రికార్డుల్ని తుత్తునియ‌లు చేయ‌డం ఖాయం. పండోర ప్రపంచం గురించి ఆసక్తిగా ఉన్న కొత్త వీక్షకులైతే సినిమా విడుదలకు ముందు మరింత తెలుసుకోవాలని కోరుకునే ఎన్నో అంశాలు ఉన్నాయి. ఈ మూవీ ని తెర‌కెక్కించిన విధానం టెక్నాల‌జీ ప‌రంగా ఏం జ‌రిగింది? అనేది మునుముందు వెల్ల‌డి కానుంది.

డిసెంబ‌ర్ 16న అవ‌తార్ 2 విడుద‌ల కానుంది. కేవ‌లం 100 రోజులే .. ఊపిరి బిగ‌బ‌ట్టండి! అంటూ అవ‌తార్ ట్విట్ట‌ర్ డేట్ ని వెల్ల‌డించ‌డంతో ఫ్యాన్స్ లో ఆనందానికి అవ‌ధుల్లేవ్. ప్ర‌స్తుతం అవ‌తార్ ఫ్యాన్స్ సంబ‌రాల్లో మునిగి తేలిపోతున్నారు. అవ‌తార్ 2 తో పాటు బ్లాక్ పాంథ‌ర్ 2 కూడా సంచ‌ల‌నాల‌కు సిద్ధ‌మ‌వుతుంటే అది మ‌రింత ఉత్కంఠ‌గా మారుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News