స్టార్ హీరోలు, టైర్ టు హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సీనియర్ హీరోలు కూడా మేము కూడా ఏ విషయంలోనూ తగ్గేదిలే అంటూ మూడు నాలుగు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతూ షాకిస్తున్నారు. ఇప్పటికే సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి మూడు భారీ ప్రాజెక్ట్ లతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. అంతులో 'గాడ్ ఫాదర్' ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో నందమూరి బాలకృష్ణ కూడా సినిమాల విషయంలో స్పీడు పెంచేశారు.
'అఖండ'తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసిన బాలకృష్ణ అదే జోష్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలని లైన్ లో పెట్టేస్తున్నాడు. 'అఖండ' వంటి హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న బాలయ్య ప్రస్తుతం తన 107వ సినిమాని గోపీచంద్ మలినేనితో చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.
శృతిహాసన్ హీరోయిన్ గా, దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ టీజర్ తో అంచనాల్ని పెంచేయడంతో ఈ మూవీకి పవర్ ఫుల్ టైటిల్ వుంటుందని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.
వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గని రీతిలో ఈ మూవీ కోసం పవర్ ఫుల్ టైటిల్ ని ఫైనల్ చేసిన చిత్ర బృందం దీపావళి సందర్భంగా టైటిల్ ని ప్రకటించబోతోంది. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత 108వ ప్రాజెక్ట్ ని కూడా బాలయ్య పట్టాలెక్కించబోతున్నాడు.
ఆహా ఓటీటీ కోసం అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికె సెకండ్ సీజన్ ని రీసెంట్ గా మొదలు పెట్టిన బాలయ్య త్వరలో 108 ప్రాజెక్ట్ ని ప్రారంభించబోతున్నాడు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ మూవీని సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించబోతున్నారు. వచ్చే నెల నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.
బాలకృష్ణ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా వయసు మల్లిన పాత్రలో కనిపించనున్న ఈ మూవీలో బాలయ్య కూతురిగా హీరోయిన్ శ్రీలీల కనిపించబోతోంది. ఇటీవల ఈ మూవీ కోసం బాలయ్యకు జోడీగా త్రిషని తీసుకోవాలనుకున్నారు. అయితే రెమ్యునరేషన్ ని భారీగా డిమాండ్ చేయడంతో తనని కాదని బాలీవుడ్ హీరోయిన్ ని సంప్రదిస్తున్నారట. అంతే కాకుండా ఈ మూవీలోని మెయిన్ విలన్ పాత్ర కోసం కూడా బాలీవుడ్ విలన్ నే అనిల్ రావిపూడి దించేయబోతుండటంతో అనిల్ .. బాలయ్య కోసం బాలీవుడ్ ని దించేస్తున్నాడని కామెంట్ లు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.