నయనతార కనెక్ట్ ఇలా అయ్యిందేంటి..?

Update: 2022-12-26 06:43 GMT
లేడీ సూపర్ స్టార్ నయనతార లేటెస్ట్ మూవీ కనెక్ట్ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అశ్విన్ శరవణన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 99 నిమిషాల డ్యూరేషన్ తోనే థియేట్రికల్ రిలీజైంది. ప్రయోగాత్మకంగా చేసిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడం లో మాత్రం విఫలమైంది. ఈ సినిమాను నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నిర్మించారు. నయనతార ఈ సినిమా కోసం ప్రమోషన్స్ కూడా చేసింది.

తను నటించిన సినిమాలకు సాధారణంగా ప్రమోషన్స్ చేయని నయన్ కనెక్ట్ సినిమాకు కావాలని ప్రమోషన్స్ లో పాల్గొన్నది. తెలుగులో కూడా సుమతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. ఇదంతా కనెక్ట్ సినిమా సొంత సినిమా అవడమే అని చెప్పొచ్చు. సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్స్ కూడా అంతే అవసరం కానీ హీరోయిన్స్ వల్లే సినిమా ఆడుతుంది అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. హీరోయిన్ సినిమాలో ఒక భాగం మాత్రమే.

కనెక్ట్ సినిమా ప్రసాద్ ఐమ్యాక్స్ సండే ఈవెనింగ్ షోలో చాలా తక్కువమంది అది కూడా వేళ్లతో లెక్కబెట్టే ఆడియన్స్ తో నడిచింది. ఇదో రకంగా నయనతారకు పెద్ద షాక్ అని చెప్పొచ్చు. తనకు ఉన్న ఫాలోయింగ్ చూసి వరుస ప్రయోగాలు చేస్తున్న నయనతార సినిమాకు ఇలాంటి దుస్థితి రావడం అందరిని షాక్ అయ్యేలా చేసింది.

అయితే కనెక్ట్ సినిమా అవుట్ డేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి ఇలాంటి రిజల్ట్ వచ్చింది అంటున్నారు. అసలు ఎవరో తెలియకుండా సినిమాలో కంటెంట్ బాగుంటే సినిమా హిట్ చేస్తున్నారు తెలుగు ఆడియన్స్.

ఇటీవల వచ్చిన మసూద సినిమా అందుకు బెస్ట్ ఎక్సాంపుల్. అలానే సినిమాలో మ్యాటర్ లేకపోతే ఎంత పెద్ద స్టార్ ఉన్నా సరే ఉపయోగం ఉండదు. సో ఈ విషయాన్ని గమనించి ఇక మీదట ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటే బెటర్ అని అంటున్నారు ఆడియన్స్. తెలుగులో తనకు ఉన్న క్రేజ్ కి కనెక్ట్ ఓ రేంజ్ లో ఆడేస్తుందని భావించిన నయనతారకి ఈ సినిమా చాలా పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News