తేజా సజ్జా హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ''హను-మాన్''. కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన జోనర్లలో సినిమాలు చేస్తున్న ప్రశాంత్.. ఇప్పుడు యంగ్ హీరోతో కలిసి ఫస్ట్ పాన్-ఇండియన్ సూపర్ హీరో మూవీతో అలరించడానికి రెడీ అయ్యారు. 'జాంబీ రెడ్డి' వంటి కమర్షియల్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో అందరిలో అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే ''హను మాన్'' ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో నవంబర్ 15న టీజర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దసరాకి రిలీజ్ చేయాలనీ అనుకున్నారు కానీ.. 'ఆదిపురుష్' కోసం వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. పండక్కి హనుమాన్ అప్డేట్ ని ప్లాన్ చేశామని.. కానీ ఆరోజు ఏకంగా రాముడే వస్తుండడంతో మా అప్డేట్ వాయిదా వేసుకున్నామని.. రాముడొచ్చిన తర్వాత ఆయన వెనుకే హనుమాన్ వస్తాడని పేర్కొన్నారు.
ఇన్ని రోజులకు 'హను మాన్' మేకర్స్ చెప్పినట్లుగా టీజర్ ను విడుదల చేయబోతున్నారు. అయితే రాముడి గాథను తెలియజేసే 'ఆదిపురుష్' సినిమా టీజర్ పై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చిన నేపథ్యంలో.. ఇప్పుడు హనుమంతుడి కథను చెప్పే మూవీ టీజర్ ఎలా ఉంటుందో.. ఏ మేరకు మెప్పిస్తుందో.. ఎలాంటి కామెంట్స్ వస్తాయో అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఇటీవల కాలంలో వచ్చిన సూపర్ నేచురల్ సినిమాల విజువల్ ఎఫెక్ట్స్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తుండటం చూస్తున్నాం. ఏమాత్రం క్వాలిటీ తగ్గినా నెటిజన్లు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. 'బ్రహ్మాస్త్రం' సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్స్ పై నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలానే ప్రభాస్ 'ఆదిపురుష్' టీజర్ చుట్టూ విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. విజువల్స్ మరియు సీజీ వర్క్ నాసిరకంగా ఉన్నాయని విమర్శలు చేసారు. దీంతో ఇప్పుడు మెరుగైన అవుట్ ఫుట్ కోసం ఏకంగా ఐదు నెలలు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
మన పురాణాలు, ఇతిహాసాల్లో అద్భుత శక్తులున్న సూపర్ హీరోస్ గురించి మనకు తెలుసు. అపూర్వమైన శక్తులు, బలాలు, పోరాటపటిమ కొనియాడబడుతున్నాయి. అలాంటి అద్భుతమైన శక్తులు ఓ సామాన్యుడికి వస్తే ఎలా ఉంటుందనే కథతో ''హను-మాన్'' సినిమా తెరకెక్కుతోందని టాక్ ఉంది. సూపర్ హీరో మూవీ కాబట్టి విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యత ఉంటుంది. ఖచ్చితంగా గ్రాఫిక్స్ పరంగా మంచి క్వాలిటీని చూపించాల్సి వస్తుంది.
వచ్చే వారం రాబోయే 'హను మాన్' టీజర్ లోనూ నాణ్యమైన వీఎఫ్ఎక్స్ ను అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఏమాత్రం నాసిరకంగా ఉన్నా నెట్టింట దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులోనూ ఇది సూపర్ హీరో సినిమా కావడంతో మనోళ్లు కాస్త ఎక్కువే ఆశిస్తారని చెప్పాలి. కాకపోతే తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ సినిమా తీస్తాడని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఇప్పటి వరకూ ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ విజువల్ ఎఫెక్ట్స్ పరంగా మెప్పించాయి.
ఇప్పుడు 'హను మాన్' అంతకుమించి ఉండొచ్చని సినీ అభిమానులు భావిస్తున్నారు. బడ్జెట్ కూడా ఎక్కువే పెట్టారు కాబట్టి.. అందులో ఎక్కువ భాగం వీఎఫ్ఎక్స్ కోసం ఖర్చు చేసి ఉంటారని అనుకుంటున్నారు. ఈ సినిమాలో తేజ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. విలక్షణ నటుడు వినయ్ రాయ్ విలన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది.
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె.నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనుదీప్ దేవ్ - హరి గౌర - జయ్ క్రిష్ - కృష్ణ సౌరభ్ వంటి నాలుగు మ్యూజిక్ డైరెక్టర్లు ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. ''హను-మాన్'' సినిమా తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషలలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.