#ప్రేమలో థ్రిల్లు: తాజ్ మ‌హ‌ల్ ఎదుటే రొమాంటిక్ తాప్సీ

Update: 2023-01-12 04:03 GMT
2022లో 'హసీన్ దిల్ రూబా' అనే రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం నేరుగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. తాప్సీ పన్ను- విక్రాంత్ మాస్సే- హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం OTT ప్రేక్షకుల నుండి అద్భుత‌ స్పందనను పొందింది. సినిమాలో తాప్సీ న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. కానీ ఇది ఓటీటీ రిలీజ్ కావ‌డంతో బ‌జ్ ఎక్కువ‌గా క్రియేట్ అవ్వ‌లేదు.

తాజా స‌మాచారం మేర‌కు.. ఈ చిత్రానికి సీక్వెల్ తెర‌కెక్కిస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రూబా' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. తాప్సీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.

అందులో తాజ్ మహల్ సమీపంలోని సరస్సులో చేతి వేళ్ల‌తో నీళ్ల‌ను తాకుతూ నీటిలో తేలియాడే ఒక అంద‌మైన తెప్ప (ప‌డ‌వ‌)పై కూర్చొని తాప్సీ చిద్విలాసంగా సాగిపోతోంది. దూరంగా తాజ్ మ‌హ‌ల్ అందంగా మ‌నోహ‌రంగా క‌నిపిస్తుంటే.. తాప్సీ బ్యాక్ లెస్ లుక్ తో చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది.

మొదటి భాగానికి కథ రాసిన కనికా థిల్లాన్ ఈ సీక్వెల్ కి కూడా రచయిత. మొదటి భాగానికి వినీల్ మాథ్యూ దర్శకత్వం వహించ‌గా.. ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా చిత్రానికి జయప్రద్ దేశాయ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్- క్రిషన్ కుమార్- ఆనంద్ ఎల్ రాయ్- హిమాన్షు శర్మ నిర్మించారు. ఇత‌ర వివ‌రాలు త్వరలో వెల్లడి కానున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News