బిగ్‌ బాస్ లో సంచలన తారలు.. అక్కడ రచ్చ రచ్చే

Update: 2022-09-21 13:30 GMT
ఒక వైపు తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 6 రసవత్తరంగా సాగుతోంది. ప్రేక్షకులు ఎప్పటిలాగే ఈ సీజన్ ను కూడా ఆదరిస్తున్నారు అంటూ నిర్వాహకులు అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్స్ ఎక్కువ శాతం ముక్కు మొహం తెలియని వారు ఉన్నారంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో హిందీ బిగ్‌ బాస్ సీజన్ 16 ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సీజన్ 16 కి కూడా సల్మాన్‌ ఖాన్‌ హోస్టింగ్‌ చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ మొదలవ్వబోతున్న ఈ  కొత్త సీజన్ లోని కంటెస్టెంట్స్ గురించి బాలీవుడ్‌ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సాదారణంగా హిందీ బిగ్ బాస్ అంటే బోల్డ్‌ బ్యూటీస్ ఉండటం చాలా కామన్‌ విషయం. ఎప్పుడెప్పుడు ఈ బోల్డ్‌ షో చూస్తామా అంటూ ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.

కంటెస్టెంట్స్ విషయంలో హిందీ బిగ్‌ బాస్ నిర్వాహకులు ఎప్పుడు కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఫేమస్ స్టార్స్ ని హిందీ బిగ్‌ బాస్ లో ఎంపిక చేస్తారు. ఈసారి ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

అందులో సంచలన తార పూనమ్‌ పాండే ఒకరు కాగా ఇటీవల ఓటీటీ బిగ్ బాస్ లో రచ్చ చేసిన ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్‌ మరొకరు. వీరిద్దరూ కూడా కచ్చితంగా అక్కడ రచ్చ చేయడం కన్ఫర్మ్‌ అంటున్నారు.

వీరిద్దరు సోషల్‌ మీడియా ద్వారా ఏ స్థాయిలో రచ్చ చేస్తున్నారో అందరికి తెల్సిందే. బోల్డ్‌ అనే పదం కూడా చిన్నబోయే విధంగా వీరిద్దరి అందాల ఆరబోత సోషల్‌ మీడియాలో ఉంటుంది.

వీరి అందాల ఆరబోతను సోషల్‌ మీడియా లు కూడా తట్టుకోలేక వీరి యొక్క అకౌంట్స్ ను సస్పెండ్‌ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి బోల్డ్‌ ముద్దుగుమ్మలు బిగ్‌ బాస్ లో ఉంటే కచ్చితంగా రచ్చ రచ్చ అనడంలో సందేహం లేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News