హిట్ 2 ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..!

Update: 2022-11-30 02:39 GMT
అడివి శేష్ లీడ్ రోల్ లో శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కిన హిట్ 2 మూవీ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. హిట్ ఫ్రాంచైజ్ గా హిట్ ఫస్ట్ కేస్ కి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హిట్ 2 ట్రైలర్ కూడా ఆడియన్స్ ని ఎక్సైట్ అయ్యేలా చేసింది. సినిమాలో విలన్ ఎవరన్నది చివరి వరకు రివీల్ చేయరట.

అంతేకాదు మర్డర్ మిస్టరీని ఛేదించే క్రమంలో ఆడియన్స్ షాక్ అయ్యేలా చాలా ట్విస్ట్ లు ఉంటాయట. సినిమా చివర్లో ప్రతి నాయకుడు ఎవరన్నది రివీల్ అయ్యే సీన్ కూడా మరో లెవల్ లో ఉంటుందని అంటున్నారు.      

థ్రిల్లర్ జోనార్ సినిమాలు ప్రేక్షకులను ఎంత ఎగ్జైట్ అయ్యేలా చేస్తే అంత ఆసక్తి ఉంటుంది. హిట్ 2 ప్రతి సన్నివేశం చాలా ఎంగేజింగ్ గా ఉంటుందట.. ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ మీద కూర్చుని చేసే సత్తా ఉందని చెబుతున్నారు. హిట్ 1 ని మించి హిట్ 2 ఉంటుందని అంటున్నారు. అడివి శేష్ కూడా ఈ మూవీలో తన పాత్రకు పూర్తి న్యాయం చేసినట్టు చెప్పుకుంటున్నారు.      

మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో ఓ పక్క థ్రిల్లర్ అంశాలు ఉత్సుకత కొనసాగిస్తూనే మరో పక్క ఎంటర్టైన్ కూడా చేస్తాయని అంటున్నారు. డైరెక్టర్ శైలేష్ ఎంతో రీసెర్చ్ చేసి ఈ కథలు రాస్తున్నారని తెలుస్తుంది. హిట్ 1, 2 మాత్రమే కాదు హిట్ 7 కూడా ఉంటుందని ఆయన చెబుతున్నారు.

అయితే ఒక్కో ఏరియాలో ఒక్కో కేసును సాల్వ్ చేసి హిట్ 7 వీరంతా కలిసి ఒక భారీ ఇన్వెస్టిగేషన్ చేస్తారని డైరెక్టర్ చెబుతున్నారు. చూస్తుంటే శైలేష్ చాలా పెద్ద స్కెచ్ వేసినట్టు అనిపిస్తుంది. హిట్ 1 తరహాలోనే హిట్ 2 కూడా కమర్షియల్ గా సక్సెస్ అందుకుంటుందా లేదా అన్నది మరో రెండు రోజుల్లో తెలుస్తుంది.

హిట్ 2 చివర్లో హిట్ 3కి సంబందించిన క్లూ.. అందులో హీరో ఎవరన్నది కూడా రివీల్ చేస్తారని చెబుతున్నారు. మొత్తానికి హిట్ ఫ్రాంచైజ్ టాలీవుడ్ లో ఒక సరికొత్త సంచలనాలను సృష్టించేలా ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News