బన్నీ నటించిన పాన్ ఇండియా సెన్సేషన్ 'పుష్ప ది రైజ్' ఎండింగ్ లో ఫహద్ ఫాజిల్ ఒక్కటి తక్కువైంది.. ఒక్కటి తక్కువైంది అన్నట్టుగానే అల్లరి నరేష్ సినిమాల్లో ఆ ఒక్కటి తక్కవవుతోందా? అంటే ఇండస్గ్రీ వర్గాలతో పాటుఅల్లరోడి అబిమానులు కూడా ఇదే మాట అంటున్నారట. గతంలో తనదైన మార్కు కామెడీ ఎంటర్ టైనర్ లతో ఆకట్టుకున్న అల్లరి నరేష్ ని అన్ని వర్గాల ప్రేక్షకులు అమితంగా ఇష్టపడతారు.
ఒకే వర్గం ప్రేక్షకులకు పరిమితం కాకుండా ఇండస్ట్రీలో వున్న హీరోలందరి అభిమానులు మెచ్చే హీరోగా ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇక దశలో వరుస సినిమాల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా రెండు.. మూడు షిఫ్ట్ లలో పని చేస్తూ బిజీ బిజీగా గడిపేసిన అల్లరి నరేష్ ఓకే రకమైన సినిమాలు చేయడం వల్ల ప్రేక్షకులు మొనాటనీ ఫిలయ్యేలా చేశాడు. దీంతో అతని సినిమాలు ఆడటం తగ్గిపోయింది. తనదైన మార్కు హాస్యంతో చేసిన సినిమాలేవీ ఆడకపోవడంతో కొంత విరామం తీసుకున్నాడు.
అల్లరి సినిమా నుంచి తనదైన మార్కు హాస్యంతో ఆకట్టుకుంటూ వస్తున్న అల్లరి నరేష్ ఆ తరువాత జానర్ మార్చి ప్రేక్షకులని ఆకట్టుకోవాలని ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టాడు. అందులో భాగంగా తన పంథాకు పూర్తి భిన్నంగా చేసిన సినిమా 'నాంది'.
సీరియస్ కాన్సెప్ట్ తో నరేష్ నటించిన ఈ మూవీ అతని కెరీర్ ని సరికొత్త మలుపు తిప్పింది. ఇకపై ఈ తరహా జోనర్ లోనూ తనని ఆదరిస్తామని ప్రేక్షకులు అభయం ఇవ్వడంతో నరేష్ అదే తరహా సీరియస్ కథవైపు అడుగులు వేయడం మొదలు పెట్టాడు.
కానీ అక్కడే పప్పులో కాలేసినట్టుగా తెలుస్తోంది. సీరియస్ స్టోరీతో అల్లరి నరేష్ చేసిన లేటెస్ట్ మూవీ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. గిరిజన ప్రజానీకానికి జరుగుతున్న అన్యాయాలపై తిరగబడే యువకుడిగా సీరియస్ కథతో రూపొందిన ఈ మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ మూవీ ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. సీరియస్ కథ కానీ అందులో బలమైన కథ, కథనాలు లేకపోవడం ప్రధాన మైనస్ గా మారింది.
'నాంది' ఎంత సీరయస్ స్టోరీ అయినా బలమైన కథ వుంది, అర్థవంతమైన కథనం వుంది కాబట్టే విజయవంతమైంది. కానీ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'లో మాత్రం అవి లేవు. దాంతో నరేష్ సక్సెస్ ని అందుకోలేకపోయాడు. మళ్లీ పాత పద్దితిలో కామెడీ సినిమాలు చేయాలని చెప్పడం లేదు. బలమైన కథలని ఎంచుకుంటూ అందులో ప్రేక్షకులని ఎంగేజ్ చేయగల ఎంటర్ టైన్ మెంట్ వుండేలా చూసుకుంటే నరేష్ కెరీర్ కి ఎలాంటి డోకా వుండదు అని ఆడియన్స్ తో పాటు విమర్శకులు అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.