యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ దాదాపుగా దశాబ్ద కాలం తర్వాత కమర్షియల్ గా సక్సెస్ ను దక్కించుకున్నాడు. కుర్ర హీరోలు వందల కోట్ల వసూళ్లు రాబడుతూ ఉంటే లోక నాయకుడు మినిమం వసూళ్లు లేక డీలా పడిపోయాడు. ఇలాంటి సమయంలో కమల్ పూర్తిగా రాజకీయాలకు పరిమితం అయ్యి సినిమాలను వదిలేస్తాడనే వార్తలు కూడా గుప్పుమన్నాయి.
కమల్ హాసన్ సినిమాలకు గుడ్ బై చెప్తాడని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా విక్రమ్ సినిమా తో కమర్షియల్ బ్లాక్ బస్టర్ దక్కింది. విక్రమ్ సినిమా పుణ్యమా అని మొదలు అయ్యి ఆగిపోయిన కమల్ రెండు సినిమా లు మళ్లీ మొదలు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. విక్రమ్ సినిమా విడుదల తర్వాత ఇండియన్ 2 ను మళ్లీ మొదలు పెట్టేందుకు కమల్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
శంకర్ కూడా ఇండియన్ 2 పట్ల సానుకూలంగా ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. కాని కమల్ అభిమానులు మాత్రం ఇండియన్ 2 తో పాటు గతంలో ఆగిపోయిన శభాష్ నాయుడు సినిమాను కూడా మళ్లీ పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా మలయాళ మహేష్ నారాయణన్ దర్శకత్వంలో కూడా కమల్ హాసన్ ఒక సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఎడిటర్ గా ఎన్నో సినిమాలకు వర్క్ చేసిన మహేష్ నారాయణన్ కు చాలా కాలంగా కమల్ హాసన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలతోనే కమల్ కు మహేష్ నారాయణన్ కథ చెప్పారట.. ఆ కథ నచ్చిన కమల్ ఓకే చెప్పాడట.
ఇండియన్ 2 మరియు శభాష్ నాయుడు సినిమాలను ఇదే ఏడాదిలో ముగిస్తారా లేదా అనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మహేష్ నారాయణన్ దర్శకత్వంలో కమల్ సినిమా మాత్రం కన్ఫర్మ్ గా వచ్చే ఏడాది ప్రారంభం అవ్వబోతుందని అంటున్నారు. టేకాఫ్ అనే సినిమాను తీసిన మహేష్ నారాయణన్ మంచి మార్కులు దక్కించుకున్నాడు.
దర్శకుడిగా తనకు ఆసక్తి కలగడానికి.. అవకాశం రావడంకు కారణం కమల్ అంటూ పలు సందర్బాల్లో చెప్పిన మహేష్ నారాయణన్ ఇప్పుడు ఆయన్నే డైరెక్ట్ చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఇవి మాత్రమే కాకుండా కొన్ని మల్టీ స్టారర్ సినిమాలు కూడా కమల్ చేసేందుకు కమిట్ అయ్యాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
మొత్తానికి విక్రమ్ సినిమా ఎఫెక్ట్ తో కమల్ హాసన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వరుసగా సినిమాలు చేసేందుకు సిద్దం అవ్వబోతున్నాడు. విక్రమ్ కు దర్శకత్వం వహించిన లోకేష్ కనగరాజ్ తో కూడా మరో సినిమాను కమల్ చేస్తాడనే వార్తలు వస్తున్నాయి.