క‌న్న‌డ ఇండ‌స్ట్రీ మ‌ళ్లీ హాట్ టాపిక్ కానుందా?

Update: 2022-09-30 05:12 GMT
టాలీవుడ్ ని బాహుబ‌లి కి ముందు బాహుబ‌లి త‌రువాత అని చూస్తున్న‌ట్టే యావ‌త్ ఇండియ‌న్ సినిమా క‌న్న‌డ ఇండ‌స్ట్రీని కూడా కేజీఓఫ్ కి ముందు.. కేజీఎఫ్ త‌రువాత ప్ర‌త్యేకంగా చూస్తోంది. 'బాహుబ‌లి'తో యావ‌త్ ప్ర‌పంచ సినిమా టాలీవుడ్ వైపు ఆశ్చ‌ర్యంతో చూసిన విష‌యం తెలిసిందే. ఇదే త‌ర‌హాలో 'కేజీఎఫ్' త‌రువాత క‌న్న‌డ ఇండ‌స్ట్రీపై కూడా ఇదే త‌ర‌హా దృష్టి పెట్టింది. ఇక్క‌డి నుంచి ఎలాంటి సినిమాలు వ‌స్తున్నాయి అని అంతా ఆరా తీయ‌డం మొద‌లైంది.

య‌ష్ న‌టించిన 'కేజీఎఫ్' సిరీస్ సినిమాలు వ‌ర‌ల్డ్ వైడ్ గా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే.  ఈ సంచ‌ల‌న మూవీ త‌రువాత క‌న్న‌డ నుంచి పాన్ ఇండియా స్థాయిలో రూపొంది అంద‌రి దృష్టిని కొన్ని సినిమాలు ఆక‌ర్షించాయి కూడా.

కిచ్చా సుదీప్ న‌టించిన 'విక్రాంత్ రోణ‌', ర‌క్షిత్ శెట్టి న‌టించిన 'చార్లీ 777' సినిమాలు దేశ వ్యాప్తంగా విడుద‌లై భారీ విజ‌యాల్ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా క‌న్న‌డ ఇండ‌స్ట్రీ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగేలా చేశాయి. కొత్త త‌ర‌హా సినిమాల‌తో సృజ‌నాత్మ‌క క‌థ‌ల‌తో క‌న్న‌డ ఇండ‌స్ట్రీ ప్ర‌యోగాలు చేస్తోంద‌ని ప్ర‌శంస‌లు కురిసేలా ఈ సినిమాలు చేశాయి.

పాన్ ఇండియా రేస్ లో క‌న్న‌డ ఇండ‌స్ట్రీ దేశ వ్యాప్తంగా బ‌ల‌మైన ప్ర‌భావాన్ని చూపిస్తున్న‌ట్టుగా తాజా సినిమాల‌తో స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ ప‌రంప‌ర‌ని కొన‌సాగిస్తూ తాజాగా క‌న్న‌డ‌లో విడుద‌లైన సినిమా సంచ‌ల‌నం సృష్టిస్తూ క‌న్న‌డ సినిమా మ‌ళ్లీ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారేలా చేస్తోంది. గ్యాంగ్ స్ట‌ర్ ఫిల్మ్ 'గ‌రుడ‌గ‌మ‌న వృష‌భ వాహ‌న‌' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న రిష‌బ్ శెట్టి న‌టించిన తాజా మూవీ 'కాంతారా'. ఈ మూవీకి త‌నే హీరో, త‌నే డైరెక్ట‌ర్‌.

'కేజీఎఫ్' మేక‌ర్స్ హోంబ‌లే ఫిలింస్ ఈ మూవీని నిర్మించింది. ఈ మూవీని ప్ర‌త్యేకంగా వీక్షించిన వారు రిష‌బ్ శెట్టిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ట్రైల‌ర్ తో భారీ క్రేజ్ ని ద‌క్కించుకున్న ఈ మూవీ ప్ర‌స్తుతం క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

సినిమాలోని చివ‌రి 30 నిమిషాలు రోమాంచిత అనుభూతిని క‌లిగిస్తున్నాయ‌ని అంతా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. స‌ప్త‌మి గౌడ హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనూ క‌న్న‌డ వెర్ష‌న్ ఈ శుక్ర‌వారం సెప్టెంబ‌ర్ 30న రిలీజ్ అవుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News