క‌రీనా..ట‌బు మ‌ధ్యలో సీత‌మ్మ‌ని న‌లిపేస్తారా?

Update: 2022-10-11 14:30 GMT
సీనియ‌ర్ భామ‌లు క‌రీనాక‌పూర్..ట‌బుల జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్నో విభిన్న రకాల పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల్ని మెప్పించారు. ఎలాంటి పాత్ర‌నైనా అవలీల‌గా పోషించగ‌ల న‌టులు. సీనియ‌ర్ భామ‌లైనా..జూనియ‌ర్ భామ‌ల‌కు అన్ని ర‌కాలుగా పోటీగా నిలుస్తున్నారు. లేటు వ‌య‌సులోనూ ఘాటు అందాల‌తో మెప్పించ‌డం అందాల భామ‌ల ప్ర‌త్యేక‌త‌.

ఆ మాధ్య ట‌బు ఓ బోల్డ్ అటెంప్ట్ సైతం చేసి కుర్ర‌కారులో కాక‌లు పుట్టించిన వైనం ఎన్న‌టికీ మ‌రువ‌లేనిది. ఇక క‌రీనా దూకుడు గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. తాజాగా ఈ ఇద్ద‌రి భామ‌ల మ‌ధ్య‌లో ఓ జూనియ‌ర్ భామ త‌ల‌పెట్టింది. ఆ భామ‌ల‌కు నేనేం త‌క్కు కాదంటూ ఇద్ద‌రి మ‌ధ్య‌లో న‌లిగిపోవ‌డానికి రెడీ అయింది. ఆమె కృతిస‌న‌న్...అలియాస్ సీత‌మ్మ‌.

'వ‌న్' చిత్రంలో న‌టించిన కృతిస‌న‌న్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మే. అటుపై 'దోచెయ్' లాంటి సినిమాలోనూ న‌టించింది. కానీ టాలీవుడ్ అమ్మ‌డిని అంత‌గా ఆద‌రించ‌లేదు.  ప్ర‌స్తుతం పాన్ ఇండియాస్టార్ ప్ర‌భాస్ సర‌స‌న ఆదిపురుష్ లో సీత పాత్ర‌తో మెప్పించ‌డానికి రెడీ అవుతోంది. తాజాగా ఈ భామ క‌రీనా..ట‌బుల‌తో ఓ బోల్డె అటెంప్ట్ కి రెడీ అయింది.

'లూట్ కేస్' ఫేం రాజేష్ కృష్ణ‌న్ ఈ ముగ్గురితో ఓ లేడీ ఓరియేంటెడ్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. కామెడీ క‌మ్ రొమాంటిక్ బోల్డ్ అటెంప్ట్ అని సమాచారం. ముగ్గురు మ‌హిళ‌ల చుట్టూ తిరిగే రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ అని తెలుస్తోంది. ఆద్యంతం న‌వ్విస్తూనే   ఆ మూడు పాత్ర‌ల మ‌ధ్య రొమాన్స్ ని భారీగా ద‌ట్టించినట్లు స‌మాచారం.

అయితే ఇందులో మేల్ లీడ్స్ ఉన్నాయా?  లేదా? అన్న‌ది క్లారిటీ లేదు. రొమాన్స్ ని సైతం ఆ ముగ్గురి మ‌ధ్య‌నే అల్లారా? అన్న‌ది మ‌రో సందేహం. ఆ వివ‌రాలు ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. ఇటీవ‌లే  స్ర్కిప్ట్ ప‌నులు పూర్తిచేసిన‌ట్లు ద‌ర్శ‌కుడు రివీల్ చేసారు.  వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో షూటింగ్ ప్రారంభించ‌డానికి స‌మాయ‌త్తం అవుతున్న‌ట్లు తెలిపారు.

కృతిస‌న‌న్ బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. టాలీవుడ్ లో ఫెయిలైనా..బాలీవుడ్ లో మాత్రం అంది వ‌చ్చిన అవ‌కాశాల్ని స‌ద్వినియోగం చేసుకుంటోంది. స్టార్ హీరోల చిత్రాల‌కు ప్ర‌మోట్ అవుతోంది. ఈ క్ర‌మంలోనే 'ఆదిపురుష్' లో న‌టించే అరుదైన అవ‌కాశం ద‌ర్శ‌కుడు ఓంరౌత్ క‌ల్పించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News