KGF 3 మొదలయ్యేది అప్పుడే

Update: 2023-01-07 16:30 GMT
కన్నడ సినిమా ఇండస్ట్రీ స్థాయిని మరో లెవెల్ కు తీసుకువెళ్లిన మొదటి సినిమా KGF. అసలు కన్నడ ఇండస్ట్రీలో 100 కోట్ల మార్కెట్ రావడమే చాలా గొప్ప అని అనుకుంటున్న సమయంలో కేజీఎఫ్ సినిమాతో వేల కోట్ల బిజినెస్ ను క్రియేట్ చేశాడు దర్శకుడు ప్రశాంతి నీల్. ఇక అందులో నటించిన హీరో యష్ కు కూడా నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు లభించింది.

ఇక అతను తదుపరి సినిమాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతొంది. ఇక యష్ అయితే రిస్క్ తీసుకోకుండా కేజిఎఫ్ సినిమాకు తగ్గట్టుగానే రాబోయే సినిమా ఉండాలి అని ప్రణాళికలుగా రచిస్తున్నాడు. అయితే కేజిఎఫ్ 2 సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద 1200 కోట్ల కోపైగా కలెక్షన్స్ అందుకుంది. కాబట్టి కేజీఎఫ్ 3 కూడా అంతకుమించి ఉండాలి అనే దర్శకుడు డిసైడ్ అయ్యాడు.

నిర్మాతలు కేజిఎఫ్ 3 సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం దర్శకుడు అయితే ప్రభాస్ తో సలార్ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అలాగే అతను జూనియర్ ఎన్టీఆర్ తో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు.

అయితే ప్రభాస్ తో రెండు సినిమాలు ఎన్టీఆర్ తో ఒక సినిమా అయిపోయిన తర్వాతనే కేజిఎఫ్ 3 ఉండబోతుంది. ఇక KGF 3 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని విషయంలో నిర్మాతలు స్పందిస్తూ 2025 లో దర్శకుడు ప్రశాంత్ నీల్ పక్కా ప్రణాళికతో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు అని ఒక వివరణ అయితే ఇచ్చారు.

అంతే కాకుండా ఆ సినిమా ఊహలకందని స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాము అని కూడా వివరణ ఇచ్చారు. ఇక KGF 3 హీరో యష్ మూడో భాగంలో ఏ విధంగా మళ్ళీ తిరిగి వస్తాడు ఇక అందులో అతని యాక్షన్ సీన్స్ ఎలివేషన్స్ ఎలా ఉంటాయి అనేది తెలియాలి అంటే మరొక నాలుగేళ్ళు ఎదురు చూడాల్సిందే. 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News