ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల జాబితా చాలా పెద్దది. ఆదిపురుష్ షూటింగ్ పూర్తి అవ్వగా సలార్ మరియు ప్రాజెక్ట్ కే సినిమా లు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ రెండు కూడా సమాంతరంగా షూటింగ్ ను జరుపుకుంటున్నాయి. మరో వైపు సందీప్ వంగ మరియు మారుతి ల కాంబోలో కూడా ప్రభాస్ సినిమా లు కన్ఫర్మ్ అయ్యాయి.
ఆ రెండు సినిమా ల టైటిల్స్ కూడా కన్ఫర్మ్ అయ్యాయి. సందీప్ వంగ సినిమా కు స్పిరిట్ అని.. మారుతి సినిమా కు రాజా డీలక్స్ అంటూ టైటిల్ నిర్ణయించారు. స్పిరిట్ అధికారికంగా ప్రకటన రాగా.. రాజా డీలక్స్ కు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రాజా డీలక్స్ టైటిల్ వెనుక పెద్ద కథే ఉందని ప్రభాస్ సన్నిహితుల ద్వారా అనధికారిక సమాచారం వినిపిస్తుంది.
మారుతి రెడీ చేసిన ప్రభాస్ సినిమా కథ మొత్తం కూడా ఒక థియేటర్ చుట్టూ తిరుగుతుందట. హర్రర్ సినిమా ల యొక్క థియేటర్ గా ఆ థియేటర్ కు పేరు ఉంటుందట. ఆ థియేటర్ పేరే రాజా డీలక్స్. ఆ థియేటర్ కు హీరో పాత్రకు సంబంధం ఉంటుందట. అందుకే టైటిల్ గా రాజా డీలక్స్ ను ఖరారు చేశారని చెబుతున్నారు.
ప్రభాస్ ఇమేజ్ కి కాస్త దూరంగా ఈ సినిమా ఉంటుందట. ప్రభాస్ ను కొత్తగా చూస్తారని.. ప్రభాస్ అభిమానులు మెచ్చే విధంగా ప్రభాస్ ఈ సినిమా లో కనిపిస్తాడని అంటున్నారు. మారుతి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ను ముగించే పనిలో ఉన్నాడు. రెండు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసేలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
ఆగస్టు లేదా సెప్టెంబర్ లో సినిమా ను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రభాస్ సన్నిహితులు అంటున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లేదా అంతకు ముందే రాజా డీలక్స్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా కూడా యూవీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దానయ్య నిర్మించబోతున్నాడు.. ప్రభాస్ కు జోడీగా ముగ్గురు ముద్దుగుమ్మలు నటించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ లీక్ లు మాత్రం చాలా చాలా వస్తున్నాయి.