'ఆచార్య' ప్లాప్ తో మెగా వైభవం బీటలు వారింది. అంతకు ముందు 'సైరా నరసింహారెడ్డి' సైతం ఆశించిన ఫలితాలు సాధించలేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా మెగా అంచనాలు అందుకోవడంలో తడబడింది. మెగాస్టార్ సమర్పకుడిగా వ్యవహరించిన హిందీ సినిమా 'లాల్ సింగ్ చడ్డా' సైతం చిరంజీవిని కాస్త డిస్టబెన్స్ కి గురిచసింది.
ఈ మూడు సంఘటనలు మెగాస్టార్ చిరంజీవిని సక్సెస్ అందుకునే వరకూ వెంటాడుతూనే ఉంటాయి. తదుపరి బ్లాక్ బస్టర్ కొట్టి అన్ని లెక్కలు మార్చాలి. అభిమానుల్లో ఉత్సాహన్ని రెట్టింపు చేయాలి. దీనిలో భాగంగా మెగాస్టార్ 67వ పుట్టిన రోజు సందర్భంగా మూడు సినిమాల అప్ డేట్స్ సైతం అందించి ఖుషీ చేసారు.
ఇప్పుడా ఉత్సాహం కొనసాగాలంటే చిరు ఖాతాలో వెంటనే ఓ హిట్ పడాలి. ఆ వెంటనే మరో హిట్..తదుపరి మరో విజయంతో అభిమానుల్లో జోష్ ని నింపాలి. మరి మెగాస్టార్ ఆరకంగా సన్నద్ధం అవుతున్నారా? అందుకే మెగా సీజన్లలో తన చిత్రాల్ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారా? అంటే అవుననే అనిపిస్తుంది.
ఇప్పటికే మెగాస్టార్ నటిస్తోన్న మలయాళం బ్లాక్ బస్టర్ 'లూసీఫర్' రీమేక్ గాడ్ ఫాదర్ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసింది. పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని పనులు పూర్తిచేసి దసరా కానుకగా ఆక్టోబర్ 5న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో అంచనాలు పతాక స్థాయికి చేరాయి. మెగాస్టార్ ఈసారి మిస్ అవ్వరంటూ అభిమానులు కాన్పిడెంట్ గా ఉన్నారు.
దసరా తో సక్సెస్ అందుకుని అదే సక్సెస్ని సక్రాంతిలోనూ కంటున్యూ చేయాలనుకుంటున్నారు. ఆయన హీరోగా నటిస్తోన్న మాస్ ఎంటర్ టైనర్ 154వ చిత్రం 'వాల్తేరు వీరయ్య'ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. బాబి దర్శకత్వం వహిస్తోన్న సినిమాపై మాస్ అభిమానులు ఎంతో కాన్పిడెంట్ గా ఉన్నారు.
వీరయ్య పాత్రలో మెగాస్టార్ మరో మాస్ హిట్ ఇస్తారని టీమ్ నమ్మకంగా పనిచేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. సగానికి పై గా షూట్ పూర్తయింది. బ్యాలెన్స్ సహా పోస్ట్ ప్రొడక్ష న్ పనులు డిసెంబర్ లోగా పూర్తిచేయాలని యూనిట్ శ్రమిస్తోంది. అలాగే కోలీవుడ్ బ్లాక్ బస్టర్ 'వేదాళం' రీమేక్ గా భోళా శంకర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
ఇందులో చిరంజీవి అజిత్ పాత్రలో మెప్పించబోతున్నారు. మెగా బంధువైన మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్టటికే 30 శాతం షూటింగ్ పూర్తయింది. బ్యాలెన్స్ షూటింగ్ కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఏప్రిల్ 14న రిలీజ్ డేట్ గా ఫిక్స్ అయ్యారు. ఇలా మెగాస్టార్ మూడు మెగా పండగ సీజన్లు దసరా..సంక్రాంతి..సమ్మర్ కి తన చిత్రాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం విశేషం.