పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'బాహుబలి' తరువాత అన్నీ హ్యూజ్ బడ్జెట్ లతో రూపొందుతున్నసినిమా లే చేస్తూ వెళుతున్నారు. ఈ మూవీ తరువాత తనకు ఏర్పడిన క్రేజ్ కు తగ్గట్టుగా బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్ట్ లు చేస్తూ వెళుతున్నారు. ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్ట్ లలో ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో మైథలాజికల్ మూవీ 'ఆది పురుష్'లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది.
ఈ మూవీతో పాటు 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ 'సలార్' లో నటిస్తున్నాడు. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై ఈ మూవీని విజయ్ కిరగందూర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ ఈ మూవీ 50 శాతం వరకు పూర్తయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ లో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ 'ప్రాజెక్ట్ కె'లో నటిస్తున్నారు.
ఈ మూడు భారీ ప్రాజెక్ట్ లు సెట్స్ పై వుండగానే ప్రభాస్ క్రేజీ డైరెక్టర్ మారుతితో ఓ భారీ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ఈ మూవీని నిర్మించాలనుకున్నారు.
త్వరలోనే ప్రకటన అనుకున్నారు. కానీ రీసెంట్ గా మారుతి 'పక్కా కమర్షియల్'తో ఫ్లాప్ ని సొంతం చేసుకోవడంతో ఆయన మనసు మార్చుకున్నారని, ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని వార్తలు వినిపించాయి. ఏం జరిగిందో ఏమో తెలియదు
తాజాగా అదే నిజమని తేలిసింది. దానయ్య స్థానంలో ఈ ప్రాజెక్ట్ ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మించబోతున్నారు. గురువారం ఆగస్టు 25న ఈ మూవీ లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకోబోతోంది. ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అన్నపూర్ణలో కానీ రామానాయుడు స్టూడియోస్ లో కానీ పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టుగా తెలిసింది.
ప్రభాస్ - మారుతిల తొలి కలయికలో తెరపైకి రానున్న ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభం కానుందని దర్శకుడు మారుతి ఓ మీడియాకు క్లారిటీ ఇచ్చారు.
సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ మూవీకి 'రాజా డీలక్స్' అనే టైటిల్ గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా ఇదే టైటిల్ కన్ఫర్మ్ అని తెలిసింది. అంతే కాకుండా ఈ మూవీ షూటింగ్ మొత్తం ఇండియాలోనే జరగనుందని, ఎక్కడా రాజా డీలక్స్ అనే థియేటర్ సెట్ ని ఏర్పాటు చేయబోతున్నది గురువారం వెల్లడించే అవకాశం వుందని తెలిసింది.