దేశ వ్యాప్తంగా వున్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎవురు చూస్తున్న భారీ క్రేజీ ప్రాజెక్ట్ లలో స్టార్ హీరో అల్లు అర్జున్ నటించనున్న 'పుష్ప ది రూల్' ఒకటి. లెక్కల మాస్టారు సుకుమార్ ఈ సారి 'పుష్ప 2 కోసం భారీగానే లెక్కలు మార్చినట్టుగా తెలుస్తోంది. స్క్రిప్ట్ దగ్గరి నుంచి లొకేషన్స్, బడ్జెట్ వరకు ప్రతీ విషయంలోనూ ఫస్ట్ పార్ట్ ని మించి సుకుమార్ పార్ట్ 2 విషయంలో భారీగా లెక్కలు మార్చేశారని తెలుస్తోంది. 'పుష్ప' గత ఏడాది డిసెంబర్ లో విడుదలైంది.
ఊహించని విధంగా పాన్ ఇండియా వైడ్ గా సంచలనాలు సృష్టించింది. ఉత్తరాదిలో ఎవరూ ఊహించని విధంగా ఈ మూవీ వంద కోట్లకు మించి వసూళ్లని రాబట్టిన విషయం తెలిసిందే. కరోనా భయాల నేపథ్యంలో ఈ మూవీని హడా విడీగా ముందస్తు ఎలాంటి ప్లాన్ చేకుండా రిలీజ్ చేశారు. అయితే 'పుష్ప' రిజల్ట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సారి పార్ట్ 2 ని పక్కా ప్రణాళికతో పకడ్బిందీ ప్లాన్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రతీ విషయాన్ని చాలా ప్రత్యేకంగా చూస్తున్నారట.
బన్నీ లుక్ దగ్గరి నుంచి బడ్జెట్, లొకేషన్స్, ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సీక్వెన్స్ ల విషయంలోనూ ఎక్కడా రాజీపడకుండా ఈ మూవీని తెరపైకి తీసుకురావాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బన్నీపై ఇటీవల లుక్ టెస్ట్ ని నిర్వహించిన చిత్ర బృందం రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో బన్నీ లేకుండానే ఈ మూవీ షూటింగ్ ని మొదలు పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి.
కానీ ఈ వార్తలపై మైత్రీ మూవీ మేకర్స్ ఇంత వరకు అధికారిక అప్ డేట్ ని అందించలేదు. దీంతో 'పుష్ప 2' రెగ్యులర్ షూట్ మొదలైందా? లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా వుంటే ఫ్రెండ్ పెళ్లి కోసం ఫ్యామిలీతో కలిసి దక్షిణాఫ్రికా వెళ్లిన అల్లు అర్జున్ తిరిగి హైదరాబాద్ రాగానే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని డిసెంబర్ నుంచి సుకుమార్ ప్రారంభించాలనుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
అంతే కాకుండా ఎలాంటి తొందర లేకుండా నిదానంగా సినిమాని అనుకున్న విధంగా పూర్తి చేసి కొంత ఎక్కువ సమయాన్నే తీసుకుని 2024 మార్చిలో లేదా ఏప్రిల్ లో సమ్మర్ కానుకగా విడుదల చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్టుగా తాజాగా వినిపిస్తోంది. 2024 లో రిలీజ్ అంటే 'పుష్ప' రిలీజ్ కి రెండేళ్లు దాటుతాయి.
ఇలా రెండేళ్ల తరువాత పార్ట్ 2 ని రిలీజ్ చేయడం అంటే మరీ టూమచ్ లేట్ అని ఫ్యాన్స్ ఫీలవయ్యే ప్రమాదం వుంది. ఎంత జక్కన్నని ఫాలో అయితే మాత్రం 'పుష్ప 2' రిలీజ్ కు మరీ ఇంత గ్యాప్ అయితే ఎలా సుక్కు సార్ అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.