శంకర్ సాంగ్ కి ఏ రేంజ్ లో ఖర్చు పెడుతున్నారో..?

Update: 2022-11-08 05:40 GMT
వెండితెర మీద ఎన్నో అద్భుతాలను సృష్టించిన డైరక్టర్ శంకర్ ప్రస్తుతం రెండు సినిమాలను ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. కమల్ హాసన్ తో ఇండియన్ 2 కొన్నాళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ సెట్స్ మీదకు వెళ్లగా మరోపక్క రాం చరణ్ తో సినిమా కూడా షూటింగ్ చేస్తున్నారు.

ఇండియన్ 2 సినిమా సగానికి పైగా పూర్తి కాగా మిగతా పార్ట్ చక చకా చేస్తున్నారు. శంకర్ ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్స్ చేస్తున్నా సరే తన పూర్తి కాన్సెంట్రేషన్ మొత్తం చరణ్ సినిమా మీద పెట్టినట్టు తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న చరణ్ ని శంకర్ మరింత భారీగా చూపించబోతున్నారట.

దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువగానే అవుతుందట. శంకర్ సినిమా అంటే బడ్జెట్ లెక్కలు ఒక రేంజ్ లో ఉంటాయి. ప్రేక్షకులను అలరించడానికి గ్రాండియర్ కోసం శంకర్ ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా చేస్తాడు.

ఈ క్రమంలోనే చరణ్ సినిమాలో కూడా ఒక్క సాంగ్ కోసం కంగా 15 కోట్ల దాకా ఖర్చు పెట్టిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సాంగ్ కోసం ఒక భారీ సెట్ కూడా వేశారట. న్యూజిలాండ్ లో షూట్ చేసుకునే ఈ సాంగ్ కోసం 15 కోట్ల వరకు బడ్జెట్ పెట్టేశారట. అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కించిన సాంగ్ గా చరణ్ 15వ సినిమాలోని ఈ సాంగ్ రికార్డ్ సృష్టిస్తుంది.

ఈ సినిమాలో తెలుగు తమిళ భాషలకు సంబందించిన నటీనటులు కూడా భాగమవుతున్నారు. చరణ్ సరసన కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. శంకర్ తన మార్క్ సోషల్ మెసేజ్.. సోషల్ కాజ్ తో కమర్షియల్ వాల్యూస్ తో ఈ మూవీ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. 2.O తర్వాత శంకర్ చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇండియన్ బాక్సాఫీస్ మీద ఈ సినిమాతో శంకర్ తన పంజా విసరాలని చూస్తున్నారు.     

RRR తో తన విశ్వరూపం చూపించిన చరణ్ మరోసారి పాన్ ఇండియా ఆడియన్స్ ని మెప్పించాలని ఫిక్స్ అయ్యారు. ఆర్సీ 15 చరణ్ సినిమాలన్నిటిలో హయ్యెస్ట్ బడ్జెట్ తో వస్తుందని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ లో ఎన్.టి.ఆర్ కూడా నటించాడు కాబట్టి అక్కడ హిట్ షేర్ ఇద్దరు తీసుకున్నారు. కానీ శంకర్ సినిమాని మాత్రం ఒంటి చేత్తో సత్తా చాటాలని చూస్తున్నాడు చరణ్. ఈ సినిమా ప్రతి విషయంలో చాలా జగ్రత్త పడుతున్న శంకర్ తన సత్తా చాటాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News