'పొన్నియన్ సెల్వన్' హిట్ తో కోలీవుడ్ కి ఊపిరిపోసినట్లు అయింది. ఇటీవల రిలీజ్ అయిన సినిమాలన్నీ భారీ అంచనాల మధ్య రావడం తప్ప! సక్సెస్ రేట్ కనిపించకపోవడంతో కాస్త కంగారు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ తో అవన్నీ పటాపంచల్ అయ్యాయి. పొన్నియన్ సెల్వన్ సక్సెస్ రూపంలో కోలీవుడ్ కి టాలీవుడ్ తరహా బాహుబలి లాంటి సక్సెస్ దొరికింది.
తమిళ సినిమా చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా నిలిచింది. ఆరకంగా పీరియాడిక్ చిత్రాల్లో సైతం తామేమి తీసిపోమని చెప్పకనే చెప్పారు. ఇప్పుడీ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో పొన్నియన్ సెల్వన్ రెండవ భాగం సైతం వీలైనంత త్వరగా పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. అయితే ఇప్పుడిదే స్ఫూర్తితో మరుగున పడిన పీరియాడిక్ చిత్రాల్ని మళ్లీ తట్టి లేపుతున్నట్లు కనిపిస్తుంది.
అప్పట్లో సుందర్ . సి దర్శకత్వంలో 'సంఘమిత్ర' సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. జయం రవి...శ్రుతి హాసన్..ఆర్య ప్రధాన పాత్రల్లో ప్రారంబమైన సినిమా చాలాభాగం షూటింగ్ కూడా పూర్తిచేసుకుంది. 72వ కేన్స్ చిత్రోత్సవాల్లో సినిమా ఫస్ట్ లుక్ ని సైతం ఆవిష్కరించారు. కానీ కొన్ని రోజుల తర్వాత సినిమా అర్ధంతరంగా ఆపేసారు. అందుకు గల కారణాలు తెలియవు గానీ...మళ్లీ ఈ చిత్రాన్ని పున ప్రారంభించడానికి రంగం సింద్దం చేస్తున్నారు.
అదే నటీనటులతో యాధావిధిగా షూటింగ్ మొదలు పెట్టాలని సుందర్ సి. భావిస్తున్నారు. ఓ అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకొస్తుందని సమాచారం. పొన్నియన్ సెల్వన్ పెద్ద సక్సెస్ అయిన నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని పున ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా భారీ బడ్జెట్ కావడం..విదేశాల్లో ఎక్కువ భాగం షూటింగ్ చేయడం సహా పలు కారణాలు అడ్డంకిగా మారి అప్పట్లో ఆపేసినట్లు ప్రచారం సాగింది.
కానీ చారిత్రక నేపథ్యం గల కథలకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతోన్న తీరుచూసి రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. అలాగే శ్రుతి హాసన్ స్థానంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని తీసుకోవాలని చూస్తున్నారుట.
సినిమాకి శ్రుతి డేట్లు అడ్జస్ట్ చేయడం కుదరకపోవడంతో ఆమె స్థానంలో దిశాని తీసుకునే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు సమాచారం. అందుకు తగ్గ పనులు వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నాయని కోలీవుడ్ వర్గాల సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.