సింహాద్రికి దారుణమైన వసూళ్లు

Update: 2023-05-23 17:00 GMT
నిన్న మొన్నటి వరకూ తెలుగు సినీ పరిశ్రమలో కొత్త సినిమాలకు మాత్రమే కలెక్షన్ల గోల ఉండేది. అయితే, ఇప్పుడు రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న నేపథ్యంలో వీటికి కూడా ఆ పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో మా హీరోనే గొప్ప అంటే.. మా హీరోనే గొప్ప అంటూ స్టార్ హీరోల ఫ్యాన్స్ గొడవలు పెట్టుకుంటున్నారు. దీనికి కారణం తాజాగా రీ రిలీజ్ అయిన 'సింహాద్రి'నే అనొచ్చు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మూవీనే 'సింహాద్రి'. ఇరవై ఏళ్ల క్రితం వచ్చి సంచలన వసూళ్లతో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ సినిమాను తారక్ పుట్టినరోజు సందర్భంగా మే 20వ తేదీన రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీనికి మొదటి రోజే భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో ఈ చిత్రం ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది.

ఎన్టీఆర్ నటించిన 'సింహాద్రి' మూవీ మొదటి రోజు అదిరిపోయే వసూళ్లను రాబట్టినప్పటికీ.. రెండో రోజు మాత్రం తేలిపోయింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ చిత్రానికి కేవలం రూ. 16 లక్షలు గ్రాస్ మాత్రమే వసూలు అయింది. ఇక, మూడో రోజు మరింత డౌన్ అయిపోయింది. ఫలితంగా దీనికి తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఊహించని విధంగా రూ. 7 లక్షలు గ్రాస్ వచ్చింది.

మొత్తంగా చూసుకుంటే రీ రిలీజ్ అయిన తర్వాత 'సింహాద్రి' మూవీ మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.13 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని ఈ సినిమాకు రూ. 4.37 కోట్లు గ్రాస్ వచ్చింది. దీంతో ఈ చిత్రం రీ రిలీజ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్టులో 'ఖుషి' తర్వాతి స్థానానికి చేరుకుంది.

ఇదిలా ఉండగా.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఏ రోజుకు ఆరోజు కలెక్షన్ల వివరాలను విడుదల చేస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే ఈ చిత్రం 'ఖుషి'ని దాటేసినట్లు చెబుతున్నారు. దీంతో అసలు ఏ రిపోర్టులు కరెక్టో అర్థం కాక సినీ ప్రియులంతా జుట్టు పీక్కుంటున్నారు. మొత్తానికి 'సింహాద్రి' వసూళ్లు డౌన్ అయ్యాయన్నది మాత్రం స్ఫష్టం అవుతోంది.

Similar News