SSMB28: ఖలేజా టైమ్ లో కూడా ఇలాంటి గొడవ లేదు!

Update: 2022-11-21 16:30 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడవ సినిమా చేయడానికి చాలా ఆలస్యంగా ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా లాంచ్ చేసి చాలాకాలం అయిన తర్వాత సెట్స్ పైకి వచ్చింది. తప్పకుండా ఈసారి జెట్ స్పీడ్ లోనే మహేష్ SSMB 28వ సినిమాను ఫినిష్ చేయబోతున్నాడు అని అందరూ అనుకున్నారు. కానీ స్క్రిప్ట్ విషయంలో మహేష్ ఈసారి కాస్త కఠినంగా ఆలోచిస్తూ ఉండడంతో అనుకున్న టైమ్ కు షూటింగ్ మొదలు పెట్టడం లేదు.

అవసరమైతే మహేష్ షూటింగ్ మధ్యలోనే క్యాన్సిల్ చేసుకునే వరకు ఆలోచిస్తున్నట్లుగా కూడా టాక్ వచ్చింది. ఇక ఈ సినిమాను ఏ క్షణంలో మొదలు పెట్టారో కానీ ఖలేజా టైమ్ కూడా రాని కష్టాలు ఎదురవుతున్నాయి.

ఖలేజా టైంలో అయితే ఎక్కువగా ఆర్థికపరమైన ఇబ్బందుల వలన ప్రాజెక్ట్ షూటింగ్ డీలే అవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు SSMB 28 వ సినిమా విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా విభిన్నమైన కారణాల వలన ఇబ్బంది పడాల్సి వస్తోంది.

స్క్రిప్ట్ సంగతి పక్కన పెడితే అసలు నటీనటులు టెక్నీషియన్స్ డేట్స్ కు సంబంధించి కొన్ని క్లాషెస్ అయితే వచ్చాయి. ముఖ్యంగా పూజా హెగ్డే డేట్స్ సెట్ అవ్వడం కష్టమయింది. అలాగే థమన్ కూడా అందుబాటులో లేకపోవడం కొంత త్రివిక్రమ్ కు ఇబ్బందిగా అనిపించింది. అయితే మొత్తానికి అన్ని సెట్ అయ్యాయి అనుకున్న సమయంలో మహేష్ బాబు ఇంట్లో విషాదం చోటు చేసుకోవడం కూడా మరొక పెద్ద మైనస్.

ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం అన్ని అన్ని విషయాల్లో కూడా త్రివిక్రమ్ టీమ్ ఒక క్లారిటీ కి వచ్చేసింది. థమన్ ను తీసేస్తున్నారు అని హీరోయిన్ విషయంలో మార్పులు జరుగుతున్నాయి అని వస్తున్న వార్తల్లో ఇలాంటి నిజం లేదు. ఎప్పటిలానే మళ్ళీ త్రివిక్రమ్ థమన్ కాంబినేషన్ రిపీట్ అవ్వాలి అని నిర్మాతలు రిస్క్ చేయడానికి ఇష్టపడలేదు.

ఇక వీలైనంత త్వరగా సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసి సినిమాను అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని త్రివిక్రమ్ గ్యాంగ్ ఆలోచిస్తుంది. మరి ఈ ప్రాజెక్టు ఖలేజా సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి. 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News