సినిమాలు స్మార్ట్ ఫోన్ లో? సీరియ‌ళ్లు టీవీల్లోనా?

Update: 2022-10-11 00:30 GMT
ఇండియా ఇప్పుడు స్మార్ట్ యుగంలో ఉంది. అంద‌రి చేతికి స్మార్ట్ ఫోన్లు వ‌చ్చేసాయి. కావాల్సినంత ఎంట‌ర్ టైన్ మెంట్ అందులోనే దొరుకుతుంది. ప్ర‌పంచంలో ఏం జ‌రిగినా క్ష‌ణాల్లో క‌ళ్ల‌ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. లైవ్ లో చూసే వెసులుబాటు ఉంది. ఇటీవలి కాలంలో ఈ  టీటీ ట్రెండ్ బాగా వృద్దిలోకి వ‌చ్చింది. కోవిడ్ తో అది పీక‌స్ కి చేరింది.

జ‌నాలంతా ఎంట‌ర్ టైన్ మెంట్ ఓటీటీ వేదిక‌గా  ఆస్వాదిస్తున్నారు. మంచి సినిమా వ‌స్తే థియేట‌ర్ కి వెళ్లి చూస్తున్నారు. లేదంటే నెల రోజుల్లో ఓటీటీలో వ‌చ్చేస్తుంది క‌దా? అన్న ధీమా ప్రేక్ష‌కుల్లో ఉంది. టీవీలో వ‌చ్చే ప్ర‌తీ  ప్రోగ్రామ్ స్మార్ట్ ఫోన్ లో అందుబాటులో ఉంటుంది. భ‌విష్య‌త్ లో డీటీహెచ్ (డైరెక్ట్ టూ హోమ్) సినిమా వ‌చ్చేస్తుంది. మ‌రి ఇప్పుడు టీవీల ప‌రిస్థితి ఏంటి? అంటే అవి ఇక సీరియ‌ళ్ల‌కు పూర్తి స్థాయిలో ప‌రిమితం అవ్వాల్సిందేన‌న్న సంకేతాలు దాదాపు అందేస్తున్నాయి.

టీవీ లో సినిమా చూడ‌టానికి ఇప్పుడు ప్రేక్ష‌కులు అంత ఆస‌క్తి చూపించ‌డం లేదా?  ప్రీమియ‌ర్ షోల విష‌యంలోనూ అదే ప‌రిస్థితి క‌నిపిస్తుందా? అంటే అవున‌నే  అంటున్నారు నిపుణులు. స‌హ‌జంగా టీవీలు చూసే జ‌నం సంఖ్య త‌గ్గు ముఖంప‌ట్టారు. ఒక‌వేళ చూసినా కేవ‌లం సీరియ‌ళ్లు చూస్తున్నారు త‌ప్ప సినిమాలు చూసే పరిస్థితి లేదు. అందుకే చాలా వ‌ర‌కూ తెలుగు ఛానెల్స్ ఎంట‌ర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్ ల్ని ఎక్కువ‌గా ప్ర‌సారం చేస్తున్నాయి.

వీకెండ్ స్పెష‌ల్ షోలు ఇప్ప‌టికే క‌నుమ‌రుగ‌య్యాయి. ఒక‌ప్ప‌డు  శ‌నివారం వ‌స్తే కొత్త సినిమాలు ప్ర‌సార‌మ‌య్యేవి. కానీ ఇప్పుడు వాటి స్థానంలో  సీరియల్స్ మాత్ర‌మే వ‌స్తున్నాయి. ఆదివారం రోజు మాత్ర‌మే ఇంకా సినిమాలొస్త‌న్నాయి. మరికొద్ది రోజుల్లో ఆదివారం సినిమా ఎంట‌ర్ టైన్ మెంట్ ని కూడా  ఛానెల్స్ తీసేసే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

ఒక‌ప్పుడు వ‌ర‌ల్డ్ ప్రీమియర్ షోల‌కు మంచి టీఆర్ పీ ఉండేది. ఇప్పుడ‌ది ఎక్క‌డా క‌నిపించలేదు. ఆ ర‌కంగా బుల్లి తెర కేవ‌లం సిరియ‌ల్స్ కే ప‌రిమితం అవుతుంది. భ‌విష్య‌త్ లో ఓటీటీ రూపం మార్చితే గ‌నుక సీరియ‌ల్స్ కూడా నేరుగా ఓటీటీలోనే అందుబాటులో వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఆర‌క‌మైన చ‌ర్య‌కు పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌క‌పోక‌పోవ‌చ్చు. ఓటీటీ లో ఉన్న పోటీ వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో స‌ద‌రు సంస్థ‌లు ఆలోచ‌న చేస్తే గ‌నుక టీవీల‌కు ఇక క‌ర్టెన్ తెర దించాల్సిందే. వాటి ఆస్వాద‌న‌కు కేవ‌లం చాలా త‌క్కువ మంది ప్రేక్ష‌కుల మాత్ర‌మే ఉండే అవ‌కాశం ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News