బిగ్‌ బాస్ 6 : మంట పెట్టిన మండే ఎపిసోడ్‌

Update: 2022-10-11 07:30 GMT
బిగ్ బాస్ ని రెగ్యులర్ గా ఫాలో అయినా కాకపోయినా కూడా చాలా మంది వీకెండ్‌ ఎపిసోడ్స్ తో పాటు మండే ఎపిసోడ్‌ ను తప్పకుండా ఫాలో అవుతూ ఉంటారు. కొందరు ముఖ్యంగా వీకెండ్‌ ఎపిసోడ్స్ కంటే కూడా మండే ఎపిసోడ్‌ ను మాత్రమే చూసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే మండే ఎపిసోడ్‌ లో నామినేషన్స్ ఉంటాయి. ఆ నామినేషన్స్ లో రచ్చ రచ్చ గా గొడవ ఉంటుంది.

మొహానికి ఏఒక్కరు కూడా మాస్క్‌ లేకుండా వ్యవహరించే టాస్క్ అది అనడంలో సందేహం లేదు. ఆరు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఏడవ వారంలో అడుగు పెట్టింది. ఈ వారంలో నామినేషన్‌ లో 9 మంది ఉన్నారు. గత వారం నామినేషన్స్‌ పక్రియ జంటలు జంటలుగా జరిగింది. ఆ సందర్బంగా పెద్దగా గొడవలు జరగలేదు.. కానీ ఈసారి మాత్రం నువ్వా నేనా అన్నట్లుగా సాగింది.

ప్రతి ఇంటి సభ్యుడు ఫోమ్ పూర్తిగా ఇద్దరికి పూసి నామినేట్‌ చేయాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించాడు. గీతూ మరియు సత్యలను కీర్తి.... శ్రీహాన్ మరియు ఆదిలను రోహిత్‌... ఆది మరియు కీర్తిలను సుదీప... గీతూ మరియు ఆదిలను వాసంతి... గీతూ మరియు రాజ్ లను శ్రీహాన్‌... గీతూ మరియు రాజ్ లను బాలాదిత్య... కీర్తి మరియు ఆదిని అర్జున్‌.... గీతూ మరియు ఆదిని సూర్య... సుదీప మరియు బాలాదిత్యను ఫైమా... శ్రీహాన్ మరియు కీర్తిలను ఇనాయా... గీతూ మరియు బాలాదిత్యలను రాజ్... కీర్తి మరియు బాలాదిత్యలను మెరీనా నామినేట్‌ చేశారు.

నామినేషన్స్ సమయంలో కొందరి మధ్య గొడవ పీక్స్ లోకి వెళ్లి పోయింది. ముఖ్యంగా ఆది రెడ్డి మరియు రోహితల మధ్య గొడవ కొట్టుకుంటారా అన్నట్లుగా సాగింది. ఒకరిపై ఒకరు చేయి చేసుకునే వరకు వెళ్లిన గొడవ ను ఇంటి సభ్యులు కాస్త చల్లార్చే ప్రయత్నం చేశారు. ఇక ఫైమా మరియు సుదీప మధ్య కూడా కాస్త సీరియస్‌ గానే సాగింది.

చాలా మంది చంటి వెళ్లడానికి కారణం అంటూ కీర్తిని నామినేట్‌ చేయడం జరిగింది. అంతే కాకుండా చంటి ఎలిమినేషన్ కి కారణం గీతూ అతడి పట్ల వ్యవహరించిన తీరు అంటూ వ్యాఖ్యలు చేసి నామినేట్‌ చేయడం జరిగింది.

మొత్తానికి ఈ వారం 9 మంది ఎలిమినేషన్ కి నామినేట్‌ అయ్యారు. ఎలిమినేట్‌ అయిన వారు.. కీర్తి.. ఆదిరెడ్డి.. గీతూ రాయల్‌... బాలాదిత్య.. సుదీప.. శ్రీహాన్‌.. రాజ్.. శ్రీసత్య.. మెరీనా లు నామినేట్‌ అయ్యారు. ఈ వారం లో మెరీనా లేదా సుదీప ఎలిమినేట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలాదిత్య కి కూడా ఈ వారం డేంజర్ అనే చెప్పొచ్చు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News