వ్యాక్సిన్ వార్ మొద‌లు పెట్టిన న‌యా డైరెక్ట‌ర్

Update: 2022-12-15 06:30 GMT
'ది క‌శ్మీర్ ఫైల్స్' చిత్రంతో  ఫేమ‌స్ అయిన వివేక్ అగ్ని హోత్రి గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వ‌రుస‌గా ప‌ది హిట్లు కొడితే ఎంత పేరు వ‌స్తుందో? అంతకు మంచి  పేరు ఒకే చిత్రంతో సాధించాడీయ‌న‌.  అందుకు కార‌ణం 'క‌శ్మీర్ ఫైల్స్' పై రిలీజ్ అనంత‌రం త‌లెత్తిన వివాదాలే. సినిమా స‌క్సెస్ కొంత వ‌ర‌కూ పేరు తెస్తే అంత‌కు మించిన పాపులారిటీ వివాదాలు తెచ్చిపెట్టాయి.

'ది తాష్కెంట్ ఫైల్స్' వ‌ర‌కూ పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌ని అగ్ని హోత్రి 'కాశ్మీర ఫైల్స్' తో వ‌చ్చిన గుర్తింపు అసాధార‌ణంగా మారింది.  ఈ నేప‌థ్యంలో ఇదే సంచ‌ల‌నాన్ని కొన‌సాగించ‌డ‌నికి 'ది ఢిల్లీ ఫైల్స్'...'ది వ్యాక్సిన్ వార్' అంటూ మ‌రో రెండు సంచ‌ల‌న చిత్రాలు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇవి వివాదాస్ప‌ద కంటెంట్ ఉన్న చిత్రాలే. 'ఢిల్లీ ఫైల్స్' తో రాజ‌ధాన్నేకెలుకుతుంటే.... వ్యాక్సిన్ పై వారే నే ప్ర‌క‌టించి ప్ర‌భుత్వానికే స‌వాల్  విస‌ర‌డానికి రెడీ అయ్యారు.

తాజాగా వాక్సిన్ వార్ సినిమా షూటింగ్ ల‌క్నోలో  ప్రారంభ‌మైంది. ఈ విష‌యాన్ని వివేక్ ట్విట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. 'మేము కొత్త విష‌యాలు...కొత్త ఆనందం..కొత్త న‌వ్వులు.. కొత్త స‌వాళ్లు కోసం జీవిస్తాం.

అదే స‌మ‌యంలో పాత ప‌ద్దితిలో హాయిగా ఉంటూ  దానికి క‌ట్టుడి ఉంటాం. ఈ వైరుద్యం బాధ‌ని క‌లిగిస్తుంది.  తెలియ‌ని దానికిలోకి  వెళ్ల‌డ‌మే ఆనందాన్ని క‌నుగొన‌డానికి వేగ‌వంత‌మైన  మార్గం' అని రాసుకొచ్చారు.

మొత్తానికి మ‌రోసారి వివేక్ తేనె త‌ట్టునే కెలుకుతున్న‌ట్లు క‌నిపిస్తుంది.  కోవిడ్ ప్రారంభ‌మైన త‌ర్వాత భార‌త్ లో  ఏర్ప‌డిన వ్యాక్సిన్ల కొర‌త గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆరంభంలో వ్యాక్సిన్ ఉత్ప‌త్తి త‌క్కువ‌గా ఉండ‌టంతో  స‌ర‌ఫరా ప‌రంగా ఇబ్బందులు ఎదుర్కున్నాం. ఇదే స‌మ‌యంలో దేశ ప్ర‌యోజ‌నాలు దృష్ట్యా  విదేశాల‌కు భార‌త్ వ్యాక్సిన్ పంపిణీ చేయ‌డం జ‌రిగింది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వంపై కొన్ని ర‌కాల విమ‌ర్శ‌లు వెల్లు వెత్తాయి. 130 కోట్ల జ‌నాభాకి సంపూర్ణ వ్యాక్సినేష‌న్ ఇప్ప‌టికైనా పూర్త‌యిందా? ఇన్ టైమ్ లో అంద‌రికీ వ్యాక్సినేష‌న్  జ‌రిగిందా? అటే లేద‌నే చెప్పాలి. ఇలాంటి అంశాల‌న్నింటిపైనే వివేక్ ది వాక్సిన్ వార్ లో  ప్ర‌స్తావించే అవకాశం ఉంది.  



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News