బాల‌య్య కోసం ప్రీ రిలీజ్ ముందు భారీ ప్రెస్ మీట్!

Update: 2022-12-30 06:30 GMT
మైత్రీ మూవీ మేక‌ర్స్  'వాల్తేరు వీర‌య్య' ని ప్ర‌చారంతో ఠారెత్తిస్తోన్న సంగ‌తి తెలిసిందే.  సినిమాకి సంబంధించిన పోస్ట‌ర్లు..లిరిక‌ల్ సింగిల్స్ ..గ్లింప్స్ అంటూ సోష‌ల్ మీడియాలో వీర‌య్య హ‌డావుడి మామూలుగా లేదు. ర‌చ‌యిత  యండ‌మూరి వీరేంద్ర‌నాధ్ ఓ పాట‌పై అభ్య‌త‌రం తెల‌ప‌డంతో వీర‌య్య మ‌రింత ప్ర‌చారంలో క‌నిపిస్తుంది. అంత‌కు ముందు ఓ భారీ ప్రెస్ మీట్ ని సైతం అల్యుమినియం ఫ్యాక్ట‌రీ సెట్ లో నిర్వ‌హించారు.

అందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు టీమ్ అంతా పాల్గొన్నారు. ఆవేడుక సంద‌ర్భంగా సినిమాకి సంబంధించిన చాలా విష‌యాలు షేర్ చేసుకున్నారు. ప్రీ -రిలీజ్ ఈవెంట్ కి  ముందు జ‌రిగిన ఆ ప్రెస్ మీట్ ఓ మినీ ప్రీరిలీజ్ ఈవెంట్ లా సాగింది.

దీంతో న‌ట‌సింహ బాల‌కృష్ణ అభిమానులు హ‌ర్ట్ అయ్యారు. వీర‌య్య‌కి జ‌రుగుతోన్న ప్ర‌మోష‌న్ వీర‌సింహారెడ్డి ఎందుకు చేయ‌డం లేదంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌లు తెర‌పైకి వ‌చ్చాయి.

చిత్ర నిర్మాణ సంస్థ బాల‌య్య సినిమా విష‌యంలో అశ్ర‌ద్ద‌గా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని...సినిమాని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆరోప‌ణలొచ్చాయి.. అయితే వీటికి నిర్మాణ సంస్థ  బ‌ధులలు ఇచ్చే ప్ర‌య‌త్నంచేసింది. థియేట‌ర్లు స‌ర్దుబాటులో బిజీగా ఉండ‌టంతోనే డిలే జ‌రుగుతోందని..త‌ప్ప‌కుండా వీర‌సింహారెడ్డికి స‌మ‌న్యాయం చేస్తామ‌ని హామీలు ఇచ్చే ప్ర‌య‌త్నం చేసారు.

ఈ నేప‌థ్యంలో నిర్మాణ వ‌ర్గాల నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ లీకైంది.  వీర‌య్య త‌ర‌హాలోనే  బాల‌య్య సినిమా ప్రీ-రిలీజ్ కి ముందు ఓస్టార్ హోట‌ల్ లో  భారీ ప్రెస్ మీట్ నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌. ఆ స‌ర్ ప్రైజ్ జ‌న‌వ‌రి  3 వ‌తేదీలో  ఉండొచ్చ‌ని స‌మాచారం. 6వ తేదిన క‌ర్నూల్ లో వీర‌సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది.

ఈ నేప‌థ్యంలో వీలైనంత త్వ‌ర‌గా ప్రెస్ మీట్ పూర్తి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌. అప్ప‌టి వ‌ర‌కూ బాల‌య్య అభిమాన‌లు శాంతించ‌రు. అలాగే  అభిమానులు  ఒంగోలులో బాల‌య్య‌కి ఘ‌న స్వాగ‌తం ఏర్పాట్లు చేస్తున్నారుట‌. బాల‌య్య ఒంగోలు గ‌డ్డ‌పై కాలు పెట్ట‌గానే బైక్..కారు ర్యాలీలు చేయాల‌న్న‌ది ప్లాన్ గా వినిపిస్తుంది. అలాగే అభిమానుల స‌మ‌క్షంలో ఓ భారీ క్రేన్ తో పూల‌మాల‌తో స‌త్కారం ఉంటుంద‌ని స‌మాచారం.    



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News