స్టార్ డైరెక్టర్ తో సినిమా అంటే ఖచ్చితంగా కండీషన్స్ అప్లై అన్నది కామన్. మరి పర భాషకు చెందిన స్టార్ హీరోతో సినిమా అంటే ఇంకా చెప్పేదేముంది ఆ కండీషన్స్ నెక్ట్స్ లెవెల్ లో వుంటాయి. ఇవన్నింటినీ తూచా తప్పకుండా స్టార్ డైరెక్టర్ పాటించాల్సిందే. ఇప్పడు 'వారసుడు' మూవీ విషయంలోనూ అదే జరుగుతోందా? అంటే అవుననే సమాధానం ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా భారీ స్థాయిలో స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం 'మహర్షి'.
ఈ మూవీని దిల్ రాజు, ప్రసాద్ వీ పొట్లూరి, సి. అశ్వనీదత్ వంటి ముగ్గురు స్టార్ ప్రొడ్యూసర్ లు నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీ తరువాత మళ్లీ స్టార్ హీరోగా సినిమా చేయడానికి దర్శకుడు వంశీ పైడిపల్లికి దాదాపు నాలుగేళ్లు పట్టింది. ప్రస్తుతం వంశీ పైడిపల్లి తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తో భారీ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీని ఏక కాలంలో విడుదల చేయబోతున్నారు.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్, పీవీపీ సినిమా వారు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ని హీరో విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఒక రోజు ముందే జూన్ 21న మేకర్స్ విడుదల చేశారు. అయితే ముందు తమిళ టైటిల్ ని రిలీజ్ చేసిన తరువాతే తెలుగు టైటిల్ ని విడుదల చేయడం గమనార్హం.
ఈ మూవీ ముందు నుంచి బైలింగ్వల్ అని డైరెక్టర్ వంశీ పైడిపల్లి చెబుతూ వస్తున్నాడు. కానీ హీరో విజయ్ మాత్రం ఇది తమిళ సినిమా, బైలింగ్వల్ కాదు అంటూ క్లారిటీ ఇస్తున్నాడు. హీరో తమిళ సినిమా అని ఖచ్చితంగా చెప్పడం, ముందుకు తమిళ్ కే ప్రాధాన్యత ఇవ్వాలని కండీషన్ పెట్టిన కారణంగానే తెలుగు డైరెక్టర్ అండ్ మేకర్స్ అయినా కూడా ముందు తమిళ టైటిల్ నే విడుదల చేశారు. ఆ తరువాతే 'వారసుడు' అంటూ తెలుగు టైటిల్ ని ప్రకటించారు.
ఈ ప్రాజెక్ట్ అంగీకరించిన సమయంలోనే హీరో విజయ్ దర్శకుడు వంశీ పైడిపల్లికి ఈ కండీషన్ పెట్టారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముందు తెలుగు టైటిల్ ప్రకటించిన తరువాతే ఏ దర్శకుడైనా తమిళ టైటిల్ ని ప్రకటిస్తారు.
కానీ విజయ్ మాత్రం ఇది తమిళ సినిమా అని.. అన్నీ అదే పంథాలో జరగాలని కండీషన్ పెట్టడం వల్లే టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లని ముందు తమిళ్, ఆ తరువాతే తెలుగు కు సంబందించిన విడుదల చేసినట్టుగా కనిపిస్తోందని, అంతే కాకుండా వంశీ పైడిపల్లితో విజయ్ సినిమా చేయడానికి ముందే ఈ కండీషన్స్ అప్లై అన్నట్టుగా స్పష్టమవుతోందని కామెంట్ లు వినిపిస్తున్నాయి.