స్టార్ హీరోయిన్ సమంత 'పుష్ప ది రైజ్'లోని 'ఊ అంటావా మావ ఊహూ అంటావా'.. ప్రత్యేక గీతంలో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసింది. అంతకు ముందు 'జాను' మూవీతో బిగ్ డిజాస్టర్ ని ఎదుర్కోవడమే కాకుండా ఆ వెంటనే విడాకుల అంశంతో మరింత ఇబ్బందకర పరిస్థితుల్ని ఎదుర్కొంది. అయితే కెరీర్ లో తొలి సారిగా అల్లు అర్జున్ 'పుష్ప ది రైజ్' కోసం ఐటమ్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సామ్ తనదైన స్టైల్ హోయలు పోతూ పాన్ ఇండియా వైడ్ గా అందరి చేత 'ఊ అంటావా మావ ఊహూ అంటావా'.. అనిపించి మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసింది.
ఇదిలా వుంటే సమంత ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూడు క్రేజీ సినిమాల్లో నటిస్తోంది. ఇందులో ఇప్పటికే రెండు షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ముందు వరుసలో మాత్రం 'యశోద' రిలీజ్ కాబోతోంది. సరోగసీ నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని తెరకెక్కించారు. సామ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇది. హరి - హరీష్ ఈ మూవీ ద్వారా దర్శకులుగా పరిచయం అవుతున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో నవంబర్ 11న భారీ యెత్తుగా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల జోరు పెంచేసింది. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాల్ని మరింతగా పెంచేసింది. సినిమాలో సామ్ సరోగసీ మదర్ గా విభిన్నమైన పాత్రలో కనిపించబోతోంది. అంతే కాకుండా 'ఫ్యామిలీ మ్యాన్ 2' తరహాలో భారీ యాక్షన్ సన్నివేశాల్లోనూ కనిపించబోతోంది.
ట్రైలర్ లో సామ్ పై చిత్రీకరించిన యాక్షన్ ఘట్టాలు సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలవనున్నాయని తెలుస్తోంది. సరోగసీ మాఫీయా నేపథ్యంలో అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీలో సమంతని ఛేజ్ చేసే ఓ డాగ్ సీన్ వుంది. ఈ సన్నివేశాల్ని చిత్ర బృందం కొడైకెనాల్ లో చిత్రీకరించారు. ఈ సీన్ సినిమాలో ప్రేక్షకుల్ని థ్రిల్ కి గురిచేయడం ఖాయం అని తెలుస్తోంది. ట్రైలర్ ఎండింగ్ లో ఈ సీన్ ని ఫ్యూ సెకండ్స్ చూపించారు.
డాగ్ తరుముతుంటే సామ్ పరుగెడుతూ కొండ అంచుల వరకు వెళ్లి ఆగిపోవడం థ్రిల్లింగ్ వుంది. ఫేల్ ఛేజింగ్ సీన్ సినిమాకు ప్రధాన హైలైట్ లలో ఒకటిగా నిలిచి థ్రిల్ చేయనుందట. ఈ సీన్ కోసం అత్యంత క్రూరమైన చిప్పిపరై అనే జాతి కుక్కని తీసుకున్నారు.
జంప్ చేయడం లోనూ, మెరుపు వేగంతో టార్గెట్ ని ఛేజ్ చేయడంలోనూ ఇవి అత్యంత షార్ప్ గా వుంటాయి. అలాంటి డాగ్ ని ఈ సినిమాలోని కీలక ఛేజ్ సీన్ కోసం వాడటంతో సినిమాలో ఈ సీన్ ఎలా వుండనుందనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.