నెట్‌ ఫ్లిక్స్ లో నిజంగానే మన 'ఘోస్ట్‌' ను ఈ స్థాయిలో చూస్తున్నారా?

Update: 2022-11-11 09:01 GMT
నాగార్జున నటించిన ది ఘోస్ట్‌ సినిమా దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. గాడ్ ఫాదర్ తో పాటు స్వాతిముత్యం సినిమాలు కూడా దసరా సందర్భంగా విడుదల అయ్యాయి. దసరాకు విడుదల అయిన ఈ మూడు సినిమాల్లో గాడ్‌ ఫాదర్ మాత్రమే సక్సెస్ అయ్యింది. మిగిలిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చాయి అని చెప్పాలి.

ది ఘోస్ట్‌ సినిమా కు నెగటివ్‌ టాక్‌ రావడంతో మినిమం కలెక్షన్స్ కూడా నమోదు అవ్వలేదు అనేడి బాక్సాఫీస్ వర్గాల మాట. ఆ విషయం పక్కన పెడితే తాజాగా ఈ సినిమా ను నెట్‌ ఫ్లిక్స్ స్ట్రీమింగ్‌ చేసింది. తెలుగు లో మాత్రమే కాకుండా హిందీ ఇంకా ఇతర భాషల్లో కూడా ఈ సినిమా ను నెట్‌ ఫ్లిక్స్ అధికారికంగా స్ట్రీమింగ్ చేయడం జరిగింది.

నాగార్జున ది ఘోస్ట్‌ సినిమాను తెలుగు ప్రేక్షకులు నెట్‌ ఫ్లిక్స్ లో ఏ స్థాయిలో చూస్తున్నారో అనే విషయం క్లారిటీ లేదు. కానీ నెట్‌ ఫ్లిక్స్ వారు మాత్రం ఈ సినిమా ను తెలుగు వర్షన్ నే కాకుండా హిందీ వర్షన్ ను కూడా ప్రేక్షకులు తెగ చూసేస్తున్నారు అంటూ అధికారికంగా ప్రకటించి అందరికి ఒకింత ఆశ్చర్యం ను కలిగించిందనే చెప్పాలి.

చిన్న సినిమాలకు వచ్చినంత బజ్ కూడా ది ఘోస్ట్‌ సినిమా స్ట్రీమింగ్‌ సందర్భంగా రాలేదు అని.. అయినా కూడా నెట్‌ ఫ్లిక్స్ ఈ సినిమా యొక్క హిందీ వర్షన్‌ నెం.1 గా మరియు తెలుగు వర్షన్ నెం.4 గా ట్రెండ్‌ అవుతుంది అంటూ చెప్పడం నమ్మశక్యంగా లేదు అంటూ కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

భారీ యాక్షన్‌ సన్నివేశాలతో ఈ సినిమా ను హాలీవుడ్‌ యాక్షన్ సినిమా రేంజ్ లో దర్శకుడు ప్రవీణ్‌ సత్తార్ తెరకెక్కించాడు. అందుకే ఈ సినిమా బాలీవుడ్ వారికి బాగా కనెక్ట్‌ అయ్యిందేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ది ఘోస్ట్‌ ను నిజంగానే నెట్‌ ఫ్లిక్స్ లో ఈ స్థాయిలో చూస్తున్నారా అంటూ కొందరు గుసగుసలాడుకుంటున్నారు. అసలు విషయం ఆ నెట్‌ ఫ్లిక్స్ వారికే తెలియాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News