క‌ళంకం తొల‌గించే ప్ర‌య‌త్నాల్లో క‌ళావ‌తి!

Update: 2022-04-16 08:30 GMT
కీర్తి సురేష్ అలియాస్ క‌ళావ‌తి పై సోష‌ల్  మీడియాలో ఏం రేంజ్ లో నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందో చెప్పాల్సిన ప‌నిలేదు. 'స‌ర్కారు వారి పాట' నుంచి కళావ‌తి పాట రిలీజ్ అయిన ద‌గ్గ‌ర నుంచి అమ్మ‌డిపై వ్య‌తిరేక ప‌వ‌నాలు మొద‌ల‌య్యాయి. పాట‌లో మ‌హేష్ మాత్ర‌మే హైలైట్ అవ్వ‌డం...కీర్తి సురేష్ లో కిక్కు లోపించ‌డం అభిమానుల్ని తీవ్ర నిరుత్సాహ ప‌రిచింది. క్రేజీ భామ‌గా వెలిగిపోయిన‌ కీర్తిపై క‌ళావ‌తి పాట‌తో కీర్తి అంకంత‌కు క్షీణించింది.

పాటలో కీర్తి సురేష్ బొద్దెక్కిన‌ట్లు క‌నిపించ‌డం..ఫేస్ లో  గ్లోనెస్ త‌గ్గ‌డం స‌హా  ఎక్స్ ప్రెష‌న్స్ ప‌రంగాను వీక్ గా క‌నిపించింది. క‌ళావ‌తి అంటే క‌ళ‌క‌ళ‌లాడిపోవాలి. అలాంటి క‌ళావ‌తి పాట‌కే క‌ళ‌కం తెచ్చేలా క‌నిపించిందంటూ ట్రోలర్స్  ఎక్కు పెట్టారు. పాట‌లో  మ‌హేష్ ని ఏమాత్రం మ్యాచ్ చేయ‌లేక‌పోయింద‌ని విమ‌ర్శ‌లు ఎదుర్కుంది. నేరుగా మ‌హేష్ అభిమానులు అసంతృప్తిని వ్య‌క్తం చేసారు.

వాస్త‌వానికి మ‌హేష్ స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టిస్తుంద‌ని ప్ర‌క‌ట‌న రాగానే మంచి కాంబినేష్ అని బ‌జ్ క్రియేట్ అయింది. కానీ క‌ళావ‌తి పాట రిలీజ్ తర్వాత సీన్ మొత్తం రివ‌ర్స్ అయింది. ఇప్పుడా నెగిటివిటీని  తొల‌గించే ప‌నిలో క‌ళావ‌తి బిజీ అయిన‌ట్లు తెలుస్తోంది. ఫ్యాన్స్ అట్రాక్ట్ చేసేలా కీర్తి జిమ్మిక్కులు చేసే ప‌నిలో ప‌డింద‌ని  టాక్ వినిపిస్తోంది.

క‌ళావ‌తి పాట రిలీజ్  త‌ర్వాత‌నే త‌ప్పిదాల్ని స‌రిద్దిద్దుకునే ప‌నిలో్ ప‌డింద‌ని.. లుక్ ప‌రంగా కొన్ని మార్పులు తీసుకొచ్చిన‌ట్లు స‌మాచారం. డైరెక్ట‌ర్ విజ‌న్ కి త‌గ్గ‌ట్టు గా హీరోయిన్ ఉన్నా.. వ్య‌క్తిగ‌తంగా మార్పులు అవ‌స‌రం అని భావించి కీర్తి సురేష్ ప‌ర్స‌న‌ల్ గా ముసురుకున్న నెగిటివిటీని తొల‌గించుకునే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని తెలుస్తోంది. మ‌రి అది ఎంత వ‌ర‌కూ ఫ‌లిస్తుందో చూడాలి.

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఈ నెగిటివిటీని వీలైనంత త్వ‌రగా చెరిపేసుకోవాలి. కీర్తి సురేష్ కి 'మ‌హాన‌టి' త‌ర్వాత వ‌చ్చి బిగ్ ఆఫ‌ర్ ఇది. ఈ సినిమా హిట్ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే.. మ‌రో రెండు పెద్ద ప్రాజెక్ట్ లు చేతిలో ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న 'భోళా శంక‌ర్ ' లో న‌టిస్తోంది.

అలాగే నేచుర‌ల్ స్టార్  నాని స‌ర‌స‌న 'ద‌స‌రా'లోనూ న‌టిస్తోంది. ఇప్ప‌ట్లో నెగివిటీని చెరుపుకోక‌పోతే భ‌విష్య‌త్ పైనా ఎంతోకొంత ప్ర‌భావం చూపిస్తుంది. అందుకే  అమ్మ‌డు ముందుగానే జాగ్ర‌త్త ప‌డుతున్న‌ట్లుంది.
Tags:    

Similar News