'లైగ‌ర్‌' టీమ్ ఎందుకు సైలెన్స్ గా వుంది?

Update: 2022-06-13 06:29 GMT
టాలీవుడ్ లో ఇప్ప‌డు ప్ర‌తీ హీరో, ప్ర‌తీ స్టార్ పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు. ఇప్ప‌టికే చాలా సినిమాలు షూటింగ్ చివ‌రి ద‌శ‌కు వ‌స్తుండ‌గా, మ‌రి కొన్ని మూవీస్ సెట్స్ పై వున్నాయి. మ‌రి కొన్ని త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌డానికి రెడీ అవుతున్నాయి. కొన్ని రిలీజ్ కు డేట్ ని కూడా ప్ర‌క‌టించేశాయి.

ఇటీవ‌ల టాలీవుడ్ తో పాటు క‌న్న‌డ నుంచి విడుద‌లైన పాన్ ఇండియా మూవీస్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లుగా నిల‌వ‌డం, వ‌ర‌ల్డ్ వైడ్ గా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డంతో త్వ‌ర‌లో థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌డానికి రెడీ అవుతున్న సినిమాల‌పై అంచ‌నాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి.

ఈ క్ర‌మంలో రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'లైగ‌ర్‌' మూవీపై తాజాగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న ఈ మూవీకి పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పూరి, చార్మీల‌తో కల‌సి బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ క‌ర‌ణ్ జోహార్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన మూవీ ఇది. స్ల‌మ్ ఏరియాలో వుండే ఛాయ్ వాలా ఎలా బాక్సింగ్ ఛాంపియ‌న్ అయ్యాడ‌న్న ఆస‌క్తిక‌ర క‌థ‌, క‌థ‌నాల‌తో ఈ మూవీని పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించారు.

వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ బాక్స‌ర్ మైక్ టైస‌న్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టించిన ఈ మూవీపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. 'ఆగ్ ల‌గాదేంగే..' అంటూ టీజ‌ర్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ చెప్పిన డైలాగ్ లు.. అత‌నిపై చిత్రీక‌రించిన యాక్ష‌న్ ఘ‌ట్టాలు సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాయి. విజ‌య్ తో పాటు ఈ మూవీపై పూరి జ‌గ‌న్నాథ్ కూడా భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. క‌ర‌న్ జోహార్ ఈ ప్రాజెక్ట్ కి యాడ్ కావ‌డంతో ఈ సినిమాకు పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ఏర్ప‌డింది.

దీంతో ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో ఐదు భాష‌ల్లో ఈ ఏడాది ఆగ‌స్టు 25న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. డేట్ ప్ర‌క‌టించి సైలెంట్ అయిపోయింది చిత్ర బృందం. ఎందుకు టీమ్ మౌనంగా వుంటోంది? అన్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలంటే దాదాపు 90 రోజుల ముందుగానే ప్ర‌మోష‌న్స్ ని ప్లాన్ చేసుకోవాలి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు టీమ్ రిలీజ్ చేసిన కంటెంట్ ఆ స్థాయి బ‌జ్ ని మాత్రం క్రియేట్ చేయ‌లేక‌పోయింది. రిలీజ్ చేసిన కంటెంట్ కూడా ఆ రేంజ్ లో లేదు.

మ‌రి 'లైగ‌ర్‌' టీమ్ ఎందుకు సైలెంట్ గా వుంటోంది? అన్న‌ది మాత్రం ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు. అయితే ఇన్ సైడ్ టాక్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వుంది. 'లైగ‌ర్‌' మూవీ థియేట‌ర్ల‌ల‌ని ద‌ద్ద‌రిల్లేలా చేయ‌డం ఖాయ‌మ‌ని, సినిమాలో అంద స్ట‌ఫ్ వుంద‌ని, ఇంత వ‌ర‌కు ఆ స్ట‌ఫ్ ని విడుద‌ల చేయ‌లేద‌ని, ట్రైల‌ర్ రిలీజ్ తో ఈ మూవీపై మ‌రింత హైప్ క్రియేట్ కావ‌డం ఖాయ‌మ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి.
Tags:    

Similar News