వాల్తేరు వీరన్నతో 'క్రాక్‌' చూపనున్న రవితేజ

Update: 2022-10-07 08:31 GMT
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా రూపొందుతున్న మెగా154 కి వాల్తేరు వీరన్న అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. టైటిల్‌ విషయంలో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. మొన్నటి వరకు వైజాగ్‌ షెడ్యూల్‌ లో చిరంజీవితో పాటు రవితేజ కూడా పాల్గొని కీలక సన్నివేశాల చిత్రీకరణ లో పాల్గొన్నాడు.

మెగా 154 సినిమాలో చిరంజీవి పాత్ర దాదాపుగా పూర్తి అయ్యిందట.. చిత్రీకరణ పూర్తి చేసుకున్న రవితేజ ప్రస్తుతం తన సినిమా రెగ్యులర్‌ షూట్‌ లో జాయిన్‌ అయ్యాడు. త్వరలో ధమాకా సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రవితేజ తాజాగా చిరంజీవి సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

రవితేజ ఇటీవలే క్రాక్‌ సినిమాతో సూపర్‌ హిట్‌ దక్కించుకున్నాడు. క్రాక్ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో కనిపించిన విషయం తెల్సిందే.

మళ్లీ మెగా 154 సినిమాలో కూడా రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్న నేపథ్యంలో తప్పకుండా సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

గతంలో రవితేజ విక్రమార్కుడు సినిమాలో కూడా పోలీస్ గా కనిపించాడు. బాబీ ఈ సినిమా పై చాలా నమ్మకంతో ఉన్నాడు. చిరంజీవి కూడా చాలా ఎక్కువ అంచనాలు పెట్టుకుని మరీ సినిమాను చేయడం జరిగింది.

వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ఇప్పటికే అధికారికంగా ప్రకటించడం జరిగింది. చిరంజీవికి జోడీగా ఈసినిమా లో శృతి హాసన్ నటించిన విషయం తెల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News