టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు దర్శకత్వంలో ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన 'ఉప్పెన' సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనాతో అల్ల కల్లోలం అవుతున్న టాలీవడ్ కు ఉప్పెన సినిమా ఇచ్చిన సక్సెస్ జోష్ చిన్నదేం కాదు.
జనాలు కరోనా భయం ఉన్నా కూడా కంటెంట్ బాగుంటే థియేటర్లకు వస్తారని ఆ సినిమా నిరూపించింది. గత ఏడాదిలోనే రావాల్సిన ఉప్పెన కరోనా వల్ల ఆలస్యం అయ్యింది. మంచి సమయంలో విడుదల అయిన ఉప్పెన వంద కోట్లకు పైగా రాబట్టింది. ఉప్పెన సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో పలువురు నిర్మాతలు బుచ్చిబాబుకు అడ్వాన్స్ లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారట.
బుచ్చి బాబు తదుపరి సినిమా ఏంటీ అంటే అంతా ఒకే మాట చెప్తున్నారు... ఎన్టీఆర్ హీరోగా బుచ్చి బాబు దర్శకత్వంలో సినిమా రూపొందబోతుంది. ఆ సినిమా మరో రేంజ్ లో ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. గురువు సుకుమార్ ను మించిన శిష్యుడు బుచ్చి బాబు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ.. ఆయన చేయబోతున్న ఎన్టీఆర్ మూవీ ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నారు.
అభిమానులు ఇంతగా చర్చించుకుంటున్నారు కాని ఇప్పటి వరకు బుచ్చి బాబు నుండి ఎలాంటి క్లారిటీ ఇన్ని రోజులు జరగలేదు. కాని తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాత్ర ఆ విషయమై అనధికారికంగా క్లారిటీ ఇచ్చినట్లు అయ్యింది. తాను ఒక పెద్ద హీరోకు స్టోరీ లైన్ చెప్పాను. ఆయన ఓకే చెప్పాడు.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని చెప్పాడు. ఒక్కో సీన్ ను పదుల వర్షన్ ల్లో రాసుకుంటున్నట్లుగా కూడా చెప్పుకొచ్చాడు. ఇది ఎన్టీఆర్ అభిమానులకు ఖచ్చితంగా గుడ్ న్యూస్ అనడంలో సందేహం లేదు.
పెద్ద హీరోతో సినిమా అంటూ బుచ్చి బాబు వ్యాఖ్యలు చేసిన సమయంలో మీరు చెప్పినా చెప్పకున్నా ఎన్టీఆర్ తో ఆ సినిమా ఉండబోతుందని మాకు తెలుసు అంటూ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అన్న సమయంలో బుచ్చి బాబు ఆ వ్యాఖ్యలను ఖండించలేదు. అదే సమయంలో ఆ పెద్ద హీరో తో సినిమా కోసం ఒక ప్రాంతీయ కథను సిద్దం చేసినట్లుగా కూడా బుచ్చి బాబు చెప్పాడు. ఆయన మాటలను బట్టి చూస్తుంటే పాన్ ఇండియా సబ్జెక్ట్ కాదని తెలుస్తోంది.
ఎన్టీఆర్ తో బుచ్చి బాబు సినిమా దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ లో జాయిన్ అయ్యేందుకు సిద్దం అవుతున్న ఎన్టీఆర్ ఆ వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. కొరటాల శివ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాను ఎన్టీఆర్ సినిమా చేయాల్సి ఉంది. కనుక వచ్చే ఏడాది ద్వితీయార్థంకు గాని బుచ్చి బాబుకు అవకాశం దక్కక పోవచ్చు అంటున్నారు. ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే ఏడాదిలోనే వచ్చే అవకాశం ఉంది.