వీడియోః ట్రెడ్డింగ్‌ లో ఉన్న 'ఉప్పెన' డిలీట్‌ సీన్‌ లు చూశారా?

Update: 2021-03-31 04:30 GMT
వైష్ణవ్‌ తేజ్‌.. కృతి శెట్టి జంటగా నటించిన ఉప్పెన సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. హీరో మొదటి సినిమాతో ఈరేంజ్ వసూళ్లు సాధించడం అంటే మామూలు విషయం కాదు. సినిమా వసూళ్ల పరంగానే కాకుండా భారీ ఎత్తున సోషల్‌ మీడియాలో కూడా హడావుడి చేస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంది. దర్శకుడు బుచ్చి బాబు తన యూట్యూబ్‌ ఛానెల్‌ లో ఉప్పెన సినిమా కోసం చిత్రీకరించి చివరి నిమిషంలో ఎడిటింగ్‌ లో లేపేసిన సీన్స్‌ ను షేర్‌ చేశాడు. ఆ సీన్స్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఇప్పటి వరకు బుచ్చి బాబు యూట్యూబ్‌ ఛానెల్‌ నుండి రెండు డిలీటెడ్‌ సీన్స్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఒకటి హీరో తన వాడ అమ్మాయిని ఒప్పించి బేబమ్మకు లెటర్‌ ఇప్పించే సన్నివేశం. ఒక పాట కూడా ఇందులో చూడవచ్చు. రీ రికార్డింగ్‌ పూర్తి కాకముందే రెండున్నర నిమిషాల సీన్‌ ను తొలగించారు. ఇక విజయ్ సేతుపతి మరియు రాజీవ్‌ కనకాల మద్య సాగే నిమిషంన్నర సన్నివేశాన్ని రీ రికార్డింగ్‌ పూర్తి అయిన తర్వాత ఎడిటింగ్‌ లో తీసేశారు. వైష్ణవ్‌ తేజ్‌ ఉన్న డిలీటెడ్‌ సన్నివేశం 24 గంటల్లోనే దాదాపుగా మిలియన్‌ వ్యూస్‌ ను దక్కించుకున్నాయి. మరో సీన్‌ కూడా రెండు లక్షల వరకు వ్యూస్‌ ను దక్కించుకుంది. బుచ్చి బాబు నుండి మరిన్ని ఉప్పెన డిలీటెడ్‌ సీన్స్‌ వచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.
Full View
Tags:    

Similar News