ఒక సినిమా హిట్ అయితే అంతకు మించి సక్సెస్ ను కొట్టాలని.. అంతకు మించి స్క్రిప్ట్ ను కావాలని దర్శకుల నుంచి హీరోలు మరియు నిర్మాత లు డిమాండ్ చేయడం కామన్ విషయం. పుష్ప విజయం సాధించిన నేపథ్యంలో పుష్ప 2 అంతకు మించి ఉండాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు సుకుమార్ ఏకంగా ఆరు ఏడు నెలల నుంచి కష్టపడుతున్నాడు. స్క్రిప్ట్ ఒక సమస్య అయితే హీరోల డేట్లు మరో పెద్ద సమస్య.
స్టార్ దర్శకులు ఒక హీరోకు కమిట్ అయితే ఆ హీరో డేట్లు లభించే వరకు వెయిట్ చేయాల్సిందే. ఆ గ్యాప్ లో ఒక చిన్న సినిమా తీద్దాం అనుకునేలా పరిస్థితి లేదు. కొరటాల శివ భరత్ అనే నేను తర్వాత దాదాపుగా మూడు సంవత్సరాల తర్వాత ఆచార్య సినిమా తో వచ్చాడు. అలాగే రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ కు ఎంత సమయం పట్టిందో అందరికి తెల్సిందే.
త్రివిక్రమ్ 2020 సంవత్సరంలో 'అల వైకుంఠపురంలో' సినిమాతో వచ్చాడు. ఇప్పటి వరకు కొత్త సినిమాను మొదలు పెట్టలేక పోయాడు. మహేష్ బాబు తో త్రివిక్రమ్ సినిమాను చేయాల్సి ఉంది. ఇంకా పలువురు స్టార్ దర్శకులు కూడా స్క్రిప్ట్ విషయంలో స్ట్రక్ అయ్యారు.. మరి కొందరు హీరోల డేట్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు.
ఇప్పుడు స్టార్ హీరోల మాదిరిగానే ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు కూడా ఆ రెండు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఉప్పెన సూపర్ హిట్ అయిన వెంటనే ఎన్టీఆర్ ని కలిసి కథ చెప్పి ఒప్పించాడు. అయితే ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా పూర్తి అయ్యి విడుదల అయ్యేప్పటికి చాలా సమయం పట్టింది. కొరటాల శివ సినిమా ను ఇప్పటికే మొదలు పెట్టాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతుంది.
కొరటాల శివ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాను ఎన్టీఆర్ చేయాల్సి ఉంది. ఇంకా ప్రారంభం కాని రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత కానీ బుచ్చి బాబు కు ఎన్టీఆర్ డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఎన్నాళ్లకు బుచ్చి బాబుకు ఎన్టీఆర్ డేట్లు ఇస్తాడో అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ ఆలస్యం చేస్తున్నాడనే ఉద్దేశ్యంతో చరణ్ వద్దకు వెళ్లిన బుచ్చి బాబుకు అక్కడ కూడా పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది.
కానీ చరణ్ కూడా ఎన్టీఆర్ కి ఏమాత్రం తగ్గకుండా బిజీ గా ఉన్నాడు. ప్రస్తుతం శంకర్ సినిమాను చేస్తున్న చరణ్ ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమాను కమిట్ అయ్యాడు. ఆ వెంటనే మరో సినిమాను కూడా కమిట్ అయ్యాడు. ఆ తర్వాత కాని బుచ్చిబాబుకు డేట్లు ఇవ్వలేడు. చిన్న హీరోలతో చేయాలంటే మనసు ఒప్పడం లేదు.. పెద్ద హీరోలతో సినిమాలకు చాలా సమయం పట్టేలా ఉంది. ఈ విపత్కర పరిస్థితి నుండి బుచ్చి బాబు ఎలా బయట పడుతాడు అనేది చూడాలి. ఈయన ఏ సినిమా చేస్తాడు అనేది చూడాలి.