'ఉప్పెన' వంటి ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన వైష్ణవ్ తేజ్, ఈ సారి ప్రేమతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'రంగ రంగ వైభవంగా' సినిమా చేశాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి గిరీశాయ దర్శకత్వం వహించాడు. వైష్ణవ్ తేజ్ జోడీగా కేతిక శర్మ అందాల సందడి చేయనుంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను సమకూర్చిన ఈ సినిమా, సెప్టెంబర్ 2వ తేదీన ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో వైష్ణవ్ తేజ్ అండ్ టీమ్ బిజీగా ఉంది. తాజాగా 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు, వైష్ణవ్ తేజ్ ను ఇంటర్వ్యూ చేశాడు.
బుచ్చిబాబు అడిగిన ప్రశ్నలకు వైష్ణవ్ తేజ్ స్పందిస్తూ .. "ఈ సినిమాలో అక్కడక్కడా పవన్ మామయ్య మేనరిజమ్స్ ను అనుకరించాను. కథలో సందర్భాన్ని బట్టి అవి సెట్ అయ్యాయి కూడా. అందుకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది.
ఈ సినిమా షూటింగ్ అంతా కూడా ఒక పెళ్లి సందడి మాదిరిగా జరిగిపోయింది. ఈ మధ్య కాలంలో అలాంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాలేదని నేను బలంగా చెప్పగలను. నేను పోషించిన రుషి పాత్ర .. కేతిక చేసిన రాధ పాత్ర ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అవుతాయి. చాలామంది ఈ పాత్రల్లో తమని చూసుకుంటారు.
ప్రస్తుతానికి హీరోగా వరుస ప్రాజెక్టులతో నేను బిజీగా ఉన్నాను. కానీ మెగాఫోన్ పట్టుకోవాలనే కోరిక మనసులో ఉంది. కొంతకాలం పాటు హీరో పాత్రలను పక్కన పెట్టైనా దర్శకత్వం చేస్తాను. ఆల్రెడీ ఒక కథ కూడా రాసుకున్నాను.
మా అన్నయ సాయితేజ్ ను .. మా బావ వరుణ్ తేజ్ కాంబినేషన్లో ఒక మల్టీ స్టారర్ చేయకులనుకుంటున్నాను. అలాంటి సమయం కోసమే వెయిట్ చేస్తున్నాను. అది త్వరలోనే వస్తుందనే ఆశ ఉంది .. అంతకు మించిన నమ్మకం ఉంది" అంటూ వైష్ణవ్ తేజ్ చెప్పుకొచ్చాడు.
మెగావారి పిలగాడు మాంఛి దూకుడు మీద ఉన్నాడు .. హీరోగా ఇప్పట్లో ఢోకా లేనట్టే అని అంతా అనుకుంటూ ఉంటే, హీరోనే మాత్రమే కాదు మనలో మంచి దర్శకుడు కూడా ఉన్నాడండోయ్ అంటూ వైష్ణవ్ తేజ్ షాక్ ఇచ్చాడు. తానే కథ రాసుకున్ననంటూ ఒక ట్విస్ట్ .. మల్టీ స్టారర్ చేస్తానంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. సాధారణంగా హీరోగా కొంత కెరియర్ నడిచాకా .. దర్శకత్వం పై కూడా కొంత అవగాహన వచ్చాక ఆ వైపున అడుగులు వేయడానికి ఎవరైనా సాహసం చేస్తారు. కానీ తాను మెగా ఫోన్ పట్టేస్తానంటూ మూడో సినిమాకే వైష్ణవ్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.