ఉప్పెన సాంగ్‌: టీనేజీ గుండెల్లో ధ‌క్ ధ‌క్ ధ‌క్

Update: 2020-03-10 04:28 GMT
మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న సినిమా ఉప్పెన‌. కృతి శెట్టి హీరోయిన్ గా న‌టిస్తోంది. దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందించారు. ఇద‌వ‌ర‌కూ ఖ‌వ్వాలీ త‌ర‌హాలో సాగే `నీ క‌న్ను నీలి స‌ముద్రం..` సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. మేన‌ల్లుడికి కోటి వ్యూస్ రావ‌డంతో అభిమానుల్లో హుషారు వ‌చ్చింది.

తాజాగా `ధ‌క్ ధ‌క్ ధ‌క్..` అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఆద్యంతం చంద్ర‌బోస్ సాహిత్యంలోని ప‌దును .. దేవీశ్రీ విన‌సొంపైన బాణీ మైమ‌రిపించాయి. శరత్ సంతోష్- హరిప్రియ ఈ పాట‌ను ఆల‌పించారు. శామ్ ద‌త్ సైనుద్దీన్ సినిమాటోగ్ర‌ఫీ గ్లింప్స్ ఈ పాట‌కు ప్ర‌ధాన అస్సెట్. ఇక నాయ‌కానాయిక‌ల మ‌ధ్య రొమాన్స్ ఎంతో పోయెటిక్ విజువ‌లైజేష‌న్ తో మైమ‌రిపించింది. ఈ వీడియో టీనేజీ కుర్రాళ్ల గుండెల్లో ధ‌క్ ధ‌క్ ధ‌క్ మ‌న‌డం ఖాయం. ఇక లిరిక్ ప‌రంగా ట్యూన్ ప‌రంగా .. రొమాన్స్ ప‌రంగా ఎంతో బ్యాలెన్సింగ్ గా చిత్రీక‌రించ‌డం లో బుచ్చిబాబు అండ్ టీమ్ స‌క్సెసయ్యారు. ఇక వైష్ణ‌వ్ ర‌ఫ్ అండ్ ఠఫ్ మాస్ కుర్రాడిగా క‌నిపిస్తుంటే.. నిత్యా క్యూట్ లుక్స్ తో క‌ట్టిప‌డేసింది. ఇక ప్ర‌తి ఫ్రేమ్ లోనూ నిత్యా ఎక్స్ ప్రెష‌న్స్ ఈ పాట‌కే వ‌న్నె తెచ్చాయంటే అతిశ‌యోక్తి కాదు.

జాల‌ర్ల కుటుంబాలు గోదారి నేప‌థ్యంలోని ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి మ్యాజిక్ చేయ‌నుందో చూడాలి. ఇక‌పోతే ఇందులో మక్కల్ సెల్వన్ విజ‌య్ సేతుప‌తి విల‌న్ గా నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ - మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 2న సినిమా విడుద‌ల కానుంంది. ఈ చిత్రానికి బృంద- ప్రేమ్ రక్షిత్ కొరియోగ్ర‌ఫీ అస్సెట్ కానుంది.
Full View
Tags:    

Similar News